మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావును అక్రమాస్తుల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Muralidhar Rao : నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ సోదాలు సుమారు 15 గంటల పాటు కొనసాగాయి. మురళీధర్ రావు నివాసమైన బంజారాహిల్స్‌తో పాటు మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో వెలుగు చూసిన కోట్లాది రూపాయల అక్రమాస్తులు ఏసీబీ అధికారుల దర్యాప్తులో మురళీధర్ రావు కుటుంబానికి చెందిన భారీ స్థిరాస్తులు,…
తరిగే పార్టీ, ఇరిగే పార్టీలు మిగతావి, పెరిగే పార్టీ మాత్రం బీజేపీనే అని వ్యాఖ్యానించారు మురళీధర్ రావు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదని, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే 50 ఏళ్లుగా ఎందుకు అపారన్నారు. తెలంగాణ కు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశం నడవాలంటే బలమైన నాయకుడు కావాలి.. అది మోడీనే అని ఆయన అన్నారు. ఉగ్ర వాదం ను కాలు కింద వేసి తొక్కిన…
సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది అని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను అవమానించే అధికారం ఎవ్వరికీ లేదు.. కాంగ్రెస్ పార్టీ అహంకారం ప్రదర్శించడం వల్ల ప్రజలు గద్దె దింపారు.
భారతదేశంలో అవినీతికి ఉదాహరణగా తెలంగాణ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు అని బీజేపీ ఛార్జ్ షీట్ కమిటీ ఛైర్మన్ మురళీధర్ రావు అన్నారు. అవినీతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం నడవడం లేదు.. పిల్లర్లు కుంగిపోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడింది.
తెలంగాణ ప్రాంతం అనేక ఉగ్రవాదాల పీడిత ప్రాంతమని మురళీధర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రకటించిన విధంగా బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని తెలిపారు. అయితే బీఆర్ఎస్ ఇజ్రాయెల్, ఉగ్రవాదం పై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు చెలిమెలో చాపలు పడుతున్నట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలని అంటే యువత ముఖ్యం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం యువతే.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వాళ్ళే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే కేసీఆర్ ను ఓడిస్తామని మురళిధర్ రావు తెలిపారు.
నేను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళిధర్ రావు అన్నారు. కేసీఆర్ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు.. కుమార స్వామినీ వదిలేశాడు.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ ను కొట్టలేరు అని ఆయన పేర్కొన్నాడు.