Tension at Tank Bund: ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత…రూ,800 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని GHMC ప్రధాన కార్యాలయం ముట్టడికి కాంట్రాక్టర్లు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఇరువురి మధ్య తీవ్ర వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంట్రాక్టర్లకు మద్దతుగా BJP కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేసారు. దీంతో అవాంఛ నీయ సంఘటనలు జరకుండా భారీగా పోలీసుల మోహరించారు. నిరసన తెలుపుతున్న పలుకాంట్రాక్టర్ల పోలీసులు అదుపులో తీసుకున్నారు. GHMC కౌన్సిల్ సమావేశానికి నల్ల బ్యాడ్జీలతో 43మంది BJP కార్పొరేటర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను విడుదల చేయాలని BJP కార్పొరేటర్లు ప్లకార్డులు పట్టుకుని సమావేశానికి రావడంతో.. ఉద్రిక్తత చోటుచేసుకుంది.
చాలా కాలం తరువాత ఇవాళ ఉదయం 10 గంటలకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ మొదలైంది. కొత్త పాలక మండలి వచ్చాక అసెంబ్లీ సమావేశాలను తలపిస్తున్నాయి. గత రెండు సమావేశాల్లో TRS వర్సెస్ బీజేపీ అన్నట్టుగా హోరాహోరీ సాగింది. టీఆర్‌ఎస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణ లు చేసుకోవడంతో అర్దాంతరంగా ముగిసిన గత రెండు బల్దియా సమావేశాలు ముగివాయి. చివరిగా గతంలో ఏప్రిల్ 12 న జరిగిన బల్దియా కౌన్సిల్ మీటింగ్ జరిగింది. గత సమావేశం తర్వాత పార్టీలు మారిన ఐదుగురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. టీఆర్‌ఎస్ నుంచి విజయారెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళగా.. దీంతో కార్పొరేటర్ల సంఖ్య నాలుగుకు పెరింగింది. అలాగే నలుగురు బీజేపీ కార్పొరేటర్లు కారు ఎక్కారు. ప్రస్తుతం బల్దియాలో పార్టీల బలాబలాలు.. టీఆర్‌ఎస్ 59, ఎంఐఎం 44, బీజేపీ 43, కాంగ్రెస్ 4 ఉన్నాయి. ఇక జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రెండు రోజులు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రజా సమస్యలు కోసం అయితేనే బల్దియా మీటింగ్ పెట్టండి, టీఆర్‌ఎస్ బీజేపీ గొడవల కోసం అయితే కౌన్సిల్ మీటింగ్ వద్దు అంటున్న కాంగ్రెస్ అంటోంది. అయితే కౌన్సిల్ మీటింగ్ ను బీజేపీ వాడుకుంటుదంటున్న టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.
Akkineni Nageswara Rao : ‘ట్రాజెడీ కింగ్’ అంటే ఆయనే!