Bhatti Vikramarka : ప్రజల చుట్టూ తిరిగే బడ్జెట్ ఇది.. ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాం
- ప్రతి కుటుంబానికి భద్రతే లక్ష్యం: భట్టి విక్రమార్క
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వేగం.. నిధుల విడుదలలో జాప్యం లేదు
- ఆరోగ్యం, విద్య రంగాల్లో భారీ ప్రణాళికలు
- రైతులకు బోనస్.. వ్యవసాయానికి ప్రత్యేక ప్రోత్సాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం సంఖ్యల చుట్టూ తిరిగే అంకెల గారడీ కాదని, ప్రతి సామాన్యుడి చుట్టూ తిరిగే మానవీయ కోణం ఉన్న ప్రణాళిక అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, గతంలో అనేక కుటుంబాలు యజమానిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉండటాన్ని తాము గమనించామని, అందుకే రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేలా భారీ ఎత్తున జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. ఎదిగే వయసున్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Israel: ఇజ్రాయెల్ అణ్వాయుధ రహస్యం.. ప్రపంచాన్ని భయపెడుతున్న ఆ ‘చివరి నిర్ణయం’ ఏమిటి..?
Also Read
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నామని భట్టి వివరించారు. లబ్ధిదారులు తమ ఇళ్లను త్వరితగతిన నిర్మించుకోవాలని, నిధుల విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని, అవసరమైతే వారానికి ఒకసారి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాకు మరో ‘తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్’ను కేటాయిస్తున్నామని, విద్యార్థులు ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదివించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే, వారికి నెలకు రూ. 2,000 స్కాలర్‌షిప్ అందిస్తున్నామన్నారు.
PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెబుతూ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, పేదలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేలా సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి క్యాష్‌లెస్ హెల్త్ కార్డులను మంజూరు చేస్తున్నామని, ఇది వారిని నమ్ముకున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఇప్పటికే రూ. 25 వేల దాకా బోనస్ అందించామని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఆగ్రో మెడిసిన్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాలు పొందిన రైతులకు బోర్ బావుల ఏర్పాటుతో పాటు సోలార్ ప్యానెల్స్ వేయించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
విద్యా సంస్థల అభివృద్ధిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి రూ. 150 కోట్లు మంజూరు చేశామని, అలాగే రాబోయే గోదావరి పుష్కరాలకు కూడా ముందస్తు ప్రణాళికలతో సిద్ధమవుతున్నామని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో ఒక వ్యక్తి పుట్టినప్పటి నుండి చివరి వరకు ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా చూడటమే తమ అదృష్టమని, కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన సగర్వంగా ప్రకటించారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!