PAN Rules: పరిమితి పెంచారు.. రూ.20 లక్షలు దాటితేనే పాన్ అవసరం.. ఏప్రిల్ 1 నుంచే అమలు..
- సాధారణ సేవింగ్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే పాన్..
- స్థిరాస్థి కొనుగోళ్లు, అమ్మకాలకు రూ.20 లక్షలు దాటితే పాన్..
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదాయపు పన్ను నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఊరటనిస్తూ స్థిరాస్తి (Real Estate) కొనుగోళ్లలో పాన్ కార్డు సమర్పించాల్సిన కనీస పరిమితిని భారీగా పెంచింది. ఇప్పటివరకు రూ.10 లక్షలు దాటిన ప్రతి ఆస్తి లావాదేవీకి పాన్ తప్పనిసరి కాగా.. మారిన నిబంధనల ప్రకారం ఆ పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నిర్ణయం తీసుకుంది.
నగరం లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, ఫ్లాట్లు లేదా ఉమ్మడి అభివృద్ధి ఒప్పందాలు (JDA) చేసుకునే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుంది. పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆస్తి కొనుగోళ్లతో పాటు ఇతర ఆర్థిక లావాదేవీల్లోనూ కీలక సవరణలు జరిగాయి. ఇదివరకు కార్లు కొంటే ధరతో సంబంధం లేకుండా పాన్ అడిగేవారు. ఇకపై ద్విచక్ర వాహనాలతో సహా ఏ మోటారు వాహనమైనా దాని ధర రూ.5 లక్షలు మించితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read
- Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
బ్యాంక్ ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా లేదా విత్ డ్రా చేసినా ఇకపై పాన్ వివరాలు సమర్పించాలి. హోటల్ బిల్లులు, రెస్టారెంట్లు లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే చెల్లింపుల పరిమితిని రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఇన్సూరెన్స్ రంగంలో పారదర్శకత కోసం ఇకపై ప్రతి పాలసీ కొనుగోలుకు పాన్ తప్పనిసరి చేశారు. ఈ మార్పుల వల్ల వ్యాపార లావాదేవీలు సులభతరం కావడమే కాకుండా, ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షణ మరింత పటిష్టంగా ఉండనుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!