వేసవి ముందు మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మండుటెండల్లో కూల్ కూల్ బీరు తాగి చిల్ అవుదామనుకునే బీరు ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. బీర్ల ధరలు పెరగడంతో బీరు లవర్స్ ఉసూరుమంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెరిగిన బీర్ల ధరలు నేటి నుంచి (ఫిబ్రవరి 11 2025)అమల్లోకి రానున్నాయి. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఏ బీరు ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం.
లైట్ బీరు రూ. 150 నుంచి 172.5 కి పెరిగింది. కేఎఫ్ ప్రీమియం రూ. 160 నుంచి రూ. 184కు, బడ్వైజర్ లైట్ రూ. 210 నుంచి రూ. 241.5 కి పెరిగింది. కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ రూ. 220 నుంచి రూ. 253, బడ్వైజర్ మ్యాగ్నం రూ. 220 నుంచి రూ. 253, టూబర్గ్ స్ట్రాంగ్ రూ. 240 నుంచి రూ. 276కి పెరిగింది. పెరిగిన బీర్ల ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో మద్యం వ్యాపారులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మందుబాబులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు రూ. 700 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరే ఛాన్స్ ఉందని అబ్కారీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read:Bhumana Karunakar Reddy: తిరుమల పవిత్రత దెబ్బ తినేలా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు..
ఏపీలో కూడా మధ్యం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే రూ.99 మద్యం బాటిల్, బీర్లు మినహాయించి మిగతా అన్ని బ్రాండ్లపై రూ. 10 చొప్పున ధరలు పెరిగాయి. ఇటీవల వ్యాపారులు మద్యం అమ్మకాలపై చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కమిషన్ 14.5 నుంచి 20 శాతం పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.