Bandisanjay is Serious about CM KCR: దేశ రాజకీయాలు సంగతి తర్వాత.. గురుకుల విద్యార్థులపై దృష్టి పెట్టండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandisanjay is Serious about CM KCR: వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని. అస్వస్థత అయిన బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బల్లి పడ్డ ఆహారం తినడం వల్లనే దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఇందులో కొంతమంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం అందుతోందని తెలిపారు.
వరుసగా గురుకులాల్లో ఇలాంటి ఘటనలు ఈ రెండు నెలల్లో చాలా జరిగాయని గుర్తు చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ తో వరుసగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు… దేశ రాజకీయాలు సంగతి తర్వాత చేద్దురు కానీ, ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నానని బండిసంజయ్ ట్విటర్ వేదిక సీఎం పై మండిపడ్డారు.
Also Read
- KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు కోర్టు బిగ్ షాక్..
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Bhadradri Kothagudem: దారుణం.. గర్భిణి కడుపులోనే కత్తెర మర్చిపోయిన నర్సు.. తల్లీబిడ్డల మృతి!
వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం తిన్నప్పటి నుంచి విద్యార్థినిలకు వాంతలు మొదలయ్యాయి. కానీ, దానిని యాజమాన్యం సీరియస్ గా తీసుకోలేదు. అయితే వాంతులతో విద్యార్థినిలు తీవ్రంగా నీరసించి పోవడంతో.. యాజమాన్యం వర్థన్న పేట ఆస్పత్రికి చికిత్స కోసం హుటాహుటిన తరలించారు. పాఠశాలలో మొత్తం మొత్తం 190 మంది విద్యార్థులు ఉండగా.. 40 మందికి విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. 40 మంది విద్యార్థులకు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా అధికారులు తెలిపారు. 12 గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా.. ఎంజీఎం కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారని అధికారులు పేర్కాన్నారు. రాత్రి భోజనంలో బల్లి కనిపించడంతో విద్యార్థులు భయ భ్రాంతులకు గురయ్యారని సమాచారం. కడుపు నొప్పితో పిల్లలు అల్లాడుతున్నారని వాపోయారు. విద్యార్థులకు ప్రథమచికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. విద్యార్థుల పూర్తీ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
గురుకులాల్లో కనీస వసతులు కూడా లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ముఖ్యమంత్రి గారు… దేశ రాజకీయాలు సంగతి తర్వాత చేద్దురు కానీ, ముందుగా గురుకులాల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నాను.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 6, 2022
తాజావార్తలు
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్‌లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..
-
Supreme Court: ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?