TSPSC: గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతల బృందం.. నాలుగు డిమాండ్లపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSPSC: తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీక్ వ్యవహారంపై నేడు గవర్నర్ తమిళిసైను బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ ఈటెల రాజేందర్, ఏవీఎన్ రెడ్డి కలిశారు. సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేయనున్న నేపథ్యంలో గవర్నర్‌తో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ లు రాజీనామ చేయాలని, TSPSC చైర్మన్ , సభ్యులను డిబార్ చేసి కొత్త కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరనున్నారు. సిట్టింగ్ జడ్జ్ తో న్యాయవిచారణ చేయించాలని, ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయిన ప్రతి అభ్యర్థికి లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని కోరునున్నారు. ఈ నాలుగు విషయాలపై గవర్నర్ తో బీజేపీ బృందం చర్చిస్తుంది.
Read also: Gold Rate Today: బంగారం కొంటున్నారా?.. కొత్త రేట్లు తెలుసుకోండి
Also Read
టీఎస్ పీఎస్సీ ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితులని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దాంతో నిందితులను చంచల్ గూడ జైలు కు పోలీసులు తరలిస్తున్నారు. అంతకుముందు 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏఈ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో జరిగిన గురుకుల ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి. ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వని వారికి సైతం రీ కరెక్షన్ పేరుతో పైరవీలు చేసి జాబ్స్ ఇప్పించాడని సరికొత్త ఆరోపణలు వస్తున్నాయి. లెక్చరర్‌గా పని చేయాలన్న నిబంధనలను పక్కనపెట్టి, పలువురు మహిళలకు ఫేక్ ఐడీ కార్డులు క్రియేట్ చేశాడని కొత్త కోణం వెలుగుచూసింది. కాగా.. టీఎస్ పీఎస్సీ ఎగ్జామ్ పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీసీఎస్ కు బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరగనుంది.
Bandi sanjay: నేడు మహిళ కమిషన్ ముందుకు బండి సంజయ్..
తాజావార్తలు
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?