Thanuja Puttaswamy : బిగ్ బాస్ సీజన్-9 నేడు అట్టహాసంగా స్టార్ట్ అయింది. తొలిరోజు కంటెస్టెంట్లు వరుసగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తనూజ గౌడ మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ.. గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నేను స్కూల్ ఏజ్ నుంచే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ను. చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాకు చదువు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ మా నాన్న టీచర్.
Read Also : Little hearts : లిటిల్ హార్ట్స్ సినిమాకు మౌళి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
మా మేనత్త కొడుకు కూడా టీచర్ కావడంతో నన్ను కూడా టీచర్ కావాలని మా నాన్న చెప్పేవారు. కానీ నాకు ఇష్టం లేదు. ఓ కన్నడ సినిమాలో ఛాన్స్ వస్తే అందులో నటించాను. అది మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. అయినా సరే నేను ఛాన్స్ వదులుకోలేదు. ఆ దెబ్బకు మా నాన్న మూడేళ్లు నాతో మాట్లాడలేదు. మెల్లిమెల్లిగా నాకు అవకాశాలు రావడం మొదలయ్యాక ఆయన నన్ను అర్థం చేసుకున్నారు. తెలుగులో నన్ను సీరియల్స్ ద్వారా చాలా మంది గుర్తు పట్టారు. ఇప్పటికీ మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అంటూ తెలిపింది తనూజ. ఇక బిగ్ బాస్ లోకి వస్తూనే తన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
Read Also : Raghava Lawrence : లారెన్స్.. నువ్వు బంగారం.. దివ్యాంగురాలికి ఏం చేశాడంటే..