Mahesh Kumar Goud: తెలంగాణ రాష్ట్రం రాగానే టీఆర్ఎస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్ళు పూర్తి చేసుకొని 10 వ ఏట అదుగుపెడుతున్న నా తెలంగాణ ప్రజలకు దశ వత్సరాల ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా, స్వరాష్ట్ర గా ఏర్పడి నేటికి పదేళ్లు అయ్యిందని అన్నారు. ఈ భౌగోళిక తెలంగాణ ఏర్పాటు కోసం ఆరు దశాబ్దాలుగా ఎంతో మంది వారి ప్రాణాలు దార పోశారని అన్నారు. ఎంతో మంది ఉద్యమకారులు వారి జీవితాలను త్యాగం చేశారని తెలిపారు. వారి త్యాగాలను స్మరించుకుంటు.. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి జోహార్లు చెపుతూ.. స్వరాష్ట్ర తెలంగాణ లో ఉం నాలుగు కోట్ల మందికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఈ రాష్ట్రంలో అంత సులువుగా ఏర్పడ్డ రాష్ట్రం కాదని అన్నారు.
60 ఏళ్ల పాటు రగిలిన ఉద్యమ అగ్నిగోళమన్నారు. 1200 మంది ప్రాణ త్యాగాల ఫలితమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా చేసిన అతి గొప్ప త్యాగం.. సాహసమన్నారు. తెలంగాణ భూమి ఉన్నంత కాలం తెలంగాణ ఏర్పాటు లో కాంగ్రెస్ పాత్రను, తల్లి సోనియమ్మ త్యాగాన్ని.. ఆమె చొరవను ఎవ్వరు కాదనలేరని తెలిపారు. కానీ తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లుగా జరుగుతున్నదేమిటి? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భౌగోళికంగా వచ్చిందే కానీ అమరుల, ఉద్యమ కారులు పోరు వీరులు కోరుకున్న తెలంగాణ సాదించుకున్నమా అని మనం బేరీజు వేస్కోవాలన్నారు. తెలంగానా రాగానే టీఆర్ఎస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తా అన్న కేసీఆర్ మాట తప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలో దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారని తెలిపారు. పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు.. ఇంటికో ఉద్యోగం అన్నాడు.. గిరిజనులకు, ముస్లిం లకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తా అన్నారని గుర్తు చేశారు. కోటి ఎకరాలకు సాగు నీరు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, మండలంలో వంద పడకల ఆసుపత్రి ఇలా అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, భ్రమలకు గురి చేసి 63 సీట్లతో గెలిచారని తెలిపారు.
ఈ దశాబ్దపు కాలంలోతెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ అయిన నెరవేరిందా అన్నది ప్రజలు ఆలోంచించాలని అన్నారు. తెలంగాణ ఏర్పటు చేస్తామని ఇచ్చిన అంత పెద్ద హామీని కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద రాష్ట్రంలో రాజకీయంగా భూ స్థాపితం అవుతామని తెలిసిన కూడా ఇచ్చామన్నారు. కానీ కేసీఆర్ ఈ పదేళ్ళలో దళితులకు భూములు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. భూములు ఇవ్వకపోగా ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకున్నాడని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చాడా? రిజర్వేషన్ ఇచ్చాడా? లక్ష రూపాయల రుణ మాఫీ చేశాడా? నిరుద్యోగ భృతి ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? సాగునీరు వచ్చిందా? ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క హామీ నెరవేర్చెలేదని అన్నారు. కేసీఆర్ రాజకీయాలను కలుషితం చేసాడు అడ్డగోలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. అవినీతి కి అడ్డు అదుపు లేదు. లక్షల కోట్ల రూపాయల అక్రమ సంపాదన అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీ ని నిర్వీర్యం చేసే కుట్ర చేశారని మండిపడ్డారు.
తెలంగాణ ఇస్తే బాగుపడ్డ కేసీఆర్ తిన్నంటి వాసాలు లెక్కపెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ నే లేకుండా చేసే కుట్ర చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తో కలిసి కాంగ్రెస్ పై విషం చిమ్మాడని నిప్పులు చెరిగారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కావు.. అది కవిత లిక్కర్ కేసులో తేట తెల్లం అయ్యిందని అన్నారు. ఇప్పుడు దశాబ్దం అయ్యింది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి.పదేళ్లు అవుతున్న మన బతుకులు మారలేదు.. దొరల ఘడీలు మళ్ళీ కొత్త రంగులు వేస్కుంటున్నాయని తీవ్రంగా మండిప్డడారు. పేదల బతుకులు మాత్రం మారలేదు.. తెలంగాణ కోసం అంతటి ఉద్యమం చేసిన మనకు ఈ దొరను దించడం కష్టమా? అంటూ ప్రశ్నించారు. రాబోయే నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి.. ఓటు తో కొట్టాలి.. కేసీఆర్ ను గద్దె దింపాలన్నారు. కాంగ్రెస్ అవస్తే 2 లక్షల రుణ మాఫీ చేస్తామన్నారు. గిట్టుబాటు ధరలకు పంటలు కొంటామన్నారు. 2 లక్ష ఉద్యోగాలు ఇస్తామని, 4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.
Telangana : కామారెడ్డిలో అమానుషం.. బైక్ పై తీసుకెళ్లి మాహిళపై అత్యాచారం..