Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కానీ ఆ బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ గా ప్రవేశపెట్టారు. దీంతో పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గా ప్రవేశపెట్టడంపై చర్చ జరగనుంది. దీనికి భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ను ఓట్ ఆన్ అకౌంట్‌గా పెట్టేందుకు కొంత అయిష్టంగానే ఉందని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని.. నిధులు ఎలా ఇవ్వాలనే విషయంలో మొదటి నుంచి మా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం వీలైనంత ఎక్కువగా వినియోగించాలని, ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు కేటాయింపులు చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Read also: Telangana Budget: త్వరలోనే రూ. 500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్..
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్య స్థాపనే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే ఈ బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా 6 హామీలను పకడ్బందీగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి కల్పనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ముఖ్యమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర అభివృద్ధిని సాధిస్తామన్నారు. గత పాలకులు ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించారన్నారు. ప్రణాళిక లేకుండా, హేతుబద్ధీకరణ లేకుండా చేసిన అప్పులు ఇప్పుడు పెద్ద సవాలుగా మారాయన్నారు. అయితే ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు, సహేతుకమైన కార్యకలాపాలతో ఈ సవాళ్లను అధిగమిస్తామన్నారు. దుబారాను తమ ప్రభుత్వం అరికడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి పనికిరాని ఆస్తులను పెంచి తెలంగాణ ప్రజలపై భారం మోపడం తమ విధానం కాదన్నారు. తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెంది సంతోషించడమే తమ ఏకైక లక్ష్యమని తెలిపారు. ఇందుకు అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని ఈ బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మరోసారి స్పష్టం చేస్తున్నట్టు భట్టి తెలిపారు.
Telangana Budget 2024: త్వరలో మెగా డీఎస్సీ.. 15000 మంది కానిస్టేబుళ్లకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు