Harbhajan Singh: జూలై 3న టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ (జూలై 4)న అదే అభిమానులు బీభత్సంగా ట్రోల్స్ తో ఆడుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో భజ్జీ చేసిన ట్వీట్ పై స్పందించడం.. కష్టాన్ని తీసుకొచ్చింది. భజ్జీ టాప్-5 ఆటగాళ్ల పేర్లను తప్పుగా రాయడంతో.. అతన్ని ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల గురించి అభిమానులు తరచుగా ట్వీట్ చేస్తుంటారు. క్రికెట్ వల్లా అనే ట్విట్టర్ వినియోగదారు కూడా ఒక ట్వీట్ చేసాడు. ఆ ట్వీట్ లో ప్రపంచంలోని టాప్- 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు.
PM Modi: ఉగ్రవాదంపై పాక్ పీఎంకి ధమ్కీ ఇచ్చిన మోడీ..
అయితే ట్వీట్‌పై స్పందించిన హర్భజన్ సింగ్.. ఐదుగురు ఆటగాళ్ల పేర్లను తెలిపాడు. ప్రపంచంలోని అత్యుత్తమ టాప్- 5 టెస్ట్ ఆటగాళ్లు నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ పేర్లను పేర్కొ్న్నాడు. అయితే ఈ ట్వీట్ చేయడమే హర్భజన్‌కు సమస్యలు తెచ్చిపెట్టింది. భజ్జీ ఇంగ్లీషులో ఆటగాళ్ల పేర్ల స్పెల్లింగ్‌ను తప్పుగా రాశాడు. ఒక్క నాథన్ లియాన్ స్పెల్లింగ్‌ను తప్ప.. మిగతా నలుగురి పేర్లను తప్పుగా పేర్కొన్నాడు. దీంతో భజ్జీపై ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.