Incharge of BJP Bahiranga Sabha: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్న నేపథ్యంలో జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతల చొప్పున ఇంఛార్జీలుగా నియమించారు. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలంసహా మనుగోడు నియోజకవర్గంలోని మొత్తం 9 మండలాలకు 18 మంది సీనియర్ నాయకులకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు.
మొత్తం 9 మండలాలకు 18 మంది సీనియర్ నాయకులు వీరే..
చౌటుప్పల్ రూరల్ మండలం: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
చౌటుప్పల్ మున్సిపాలిటీ: పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి
మునుగోడు: పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి
సంస్థాన్ నారాయణపురం: మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్.
చండూరు: మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ
చండూరు మున్సిపాలిటీ: పార్టీ శాసనసభాపక్షనేత రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి
గట్టుప్పల్: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్
మర్రిగూడెం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి
నాంపల్లి: మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించారు.
మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈనెల ఆగస్ట్ 21న మునుగోడులో అమిత్ షా సభ తర్వాత స్థానిక బీజేపీ నేతలు ఏం చేయాలనే విషయంలో కూడా బీజేపీ హై కమాండ్ ఇప్పటికే క్లియర్‌గా ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు (ఈనెల 22) నుంచి మునుగోడులో బీజేపీ నేతలు మకాం వేయనున్నారు. ఈ నెల 21న అమిత్‌షా సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ ఎన్నికల కమిటీ వేయనుంది. ఇకఅమిత్‌షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో.. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారన్న విషయం తెలిసిందే.
Reliance Jio: మళ్లీ సత్తా చాటిన జియో.. ఎవరి స్థానం ఏంటి..?