Sukhoi Crash: సుఖోయ్ విషాదం.. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న పైలట్ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sukhoi Crash: గురువారం అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో భారత వైమానిక దళం సుఖోయ్ Su-30 MKI ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు. మరణించిన వారిలో ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ ఉన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’లో దురాగ్కర్ పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దుర్ఘటనలో భారత వైమానికదళం అత్యుత్తమ పైలట్‌ను కోల్పోయింది.
28 ఏళ్ల దురాగ్కర్ 10 రోజుల క్రితమే కుటుంబ సభ్యుల్ని కలిశారు. తన కొడుకు ఆపరేషన్ సిందూర్‌లో భాగమని మొదట తెలియదని, ఈ ఆపరేషన్ జరిగిన 15 రోజుల తర్వాత తెలిసిందని ఆయన తండ్రి రవీంద్ర దురాగ్కర్ అన్నారు. తన కొడుకు వైమానిక దళంలో భాగమైనందుకు గర్వంగా ఉందని, యుద్ధవిమానాల గురించి తనకు చెప్పేవాడని కన్నీంటిపర్యంతమయ్యారు. తన కొడుకు తన కలను సాధించారని, కానీ కోరుకున్నంత కాలం దేశానికి సేవ చేయలేకపోయారని అన్నారు.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
Read Also: Anuj Agnihotri: యూపీఎస్సీ 2025 టాపర్‌గా నిలిచిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి! ప్రస్థానం ఇదే..
ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్,స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ Su-30 MKIలో శిక్షణా కార్యక్రమంలో ఉండగా, అది జోర్హాట్ వైమానిక స్థావరం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అదృశ్యమైంది. టేకాఫ్ ప్రాంతం నుంచి 60 కి.మీ దూరంలో విమానం కుప్పకూలింది.
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని అనేక ఉగ్రవాద శిబిరాలపై భద్రతా దళాలు దాడి చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చాయి. దీని తర్వాత పాక్ సైన్యం జరిపిన దాడుల్ని కూడా భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!