Bandi Sanjay: బీజేపీ తలదించుకునే పని చేయను.. బండి సంజయ్ కంటతడి..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: జై శ్రీరాం అంటే కడుపు నిండటం కాదు, ఈ నినాదమే మాలో ఆలోచన, ఆవేశం, పౌరుషాన్ని నింపుతుందని బండి సంజయ్ అన్నారు. ఈ నినాదం మీ గడీలను బద్ధలు కొడుతుందని టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. శ్రీరామ్‌ నినాదంతోనే ఆ పార్టీని ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశామని, మోడీ లేకుంటే తెలంగాణ ప్రభుత్వం నడవదని అన్నారు. తెలంగాణకు ప్రధాని నరేంద్రమోడీ నిధులు ఇస్తున్నారని, ఈ నిధులనే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి మోసుకెళ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేస్తున్నాయని రాహుల్, ప్రియాంకా గాంధీలపై విమర్శలు చేశారు.

Read Also: S Keerthana: 29 ఏళ్లకే మంత్రి.. 5 భాషల్లో ప్రావీణ్యం.. విజయ్ కేబినెట్‌లో స్పెషల్‌గా కీర్తన..

బెంగాల్‌లో అనేక మంది కార్యకర్తల బలిదానాల తర్వాత అధికారంలోకి వచ్చామని చెప్పారు. తెలంగాణలో రామ రాజ్యం, మోడీ రాజ్యం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వడ్లను కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఢిల్లీకి డబ్బులు పంపించే పనిలో కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందని ఆరోపించారు. సనాతన ధర్మం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, 80 శాతం హిందువుల కోసం పని చేసే పార్టీ బీజేపీ అని, ఏ ఒక్క వర్గానికి కొమ్ముకాయమని చెప్పారు.

నేను ఏ రోజు కూడా పార్టీ తల వంచుకునే పనిచేయనని, పార్టీ కోసమే పనిచేస్తున్నామని, తాను బీజేపీ కార్యకర్తనని, తల ఎత్తుకుని సగర్వంగా పనిచేస్తానని అన్నారు. చేతకాని వారు, రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేని వారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నానని ఆరోపించారు. తాను ఫామ్ హౌజ్‌లో ఎలుకను కాదని అన్నారు. సామాస్య కార్యకర్త నుంచి ఒక ఏబీవీపీ కార్యకర్తగా, బీజేపీ కార్యకర్తగా, మోడీ శిష్యుడిగా పనిచేస్తున్నానని అన్నారు. బీజేపీ తలదించుకునే పని చేసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే అని చెప్పారు.