చర్చిలోపల 'జై శ్రీరామ్' నినాదాలు చేసిన ఉదంతం మేఘాలయలో వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆకాష్ సాగర్‌పై సామాజిక కార్యకర్త ఏంజెలా రంగద్ ఫిర్యాదు చేశారు. ఎపిఫనీ చర్చిలోకి నిబంధనలు అతిక్రమించాడని, చర్చి యొక్క మతపరమైన పవిత్రతను ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీశాడని పేర్కొన్నారు.
కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరపూరిత చర్య ఎలా అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్…
Jai Shri Ram: ఉత్తర్ ప్రదేశ్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ‘జై శ్రీరాం’ నినాదాలు, క్రికెటర్ల పేర్లను సమాధానాలుగా రాసి పరీక్షల్లో పాసైన ఘటన వెలుగులోకి వచ్చింది. పాటలు, మ్యూజిక్, మతపరమైన నినాదాలను ఆన్సర్ పేపర్‌లో రాశారు. అయితే, ఈ ఘటనలో వారిని పాస్ చేసేందుకు ప్రొఫెసర్ డబ్బులు వసూలు చేసినట్లు తేలింది.
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ప్రసిద్ధ ఈఫిల్ టవర్ దగ్గర కొందరు రామ భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ దేశాల్లో పలువురు కార్లతో భారీ ర్యాలీలు తీశారు.
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు.
Vande Bharat Express : పశ్చిమ బెంగాల్‌లోని హౌరా రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు హైడ్రామా చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.