Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై చేతు లెత్తేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ రైతు దీక్షలో వున్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందన్నారు. కోట్లాది రూపాయల ప్రకటనలతో 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
Read also: RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనయ్.. వెంటనే బోనస్ ప్రకటించండి అని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు? అని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చేతికందిన పంట నీళ్లపాలైందని అన్నారు. అకాల వర్షాలకు రాలిపోయిన మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియాకు చూపించారు.
Read also: Madhya Pradesh : రూ.29లక్షల రివార్డ్.. భయంకరమైన నక్సలైట్ క్రాంతి హతం
సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అని అన్నారు. ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేశారు. రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు చెల్లించాల్సిందే అన్నారు. రైతు కూలీలకు సైతం ఏటా రూ.12 వేల ఇవ్వాల్సిందే అన్నారు. కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయరు…. పంటల బీమాను అమలు చేయరు.. రైతులెలా బతకాలి? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తక్షణమే వడ్ల కొనుగోలు చేయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేస్తున్నా అని తెలిపారు.
Fake Doctors: నకిలీ వైద్యులు, ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థలపై టీఎస్‌ఎంసీ ఉక్కుపాదం..
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!