Kadiyam Srihari: అప్పుడు బీఆర్ఎస్ చేస్తే సరైంది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పా? స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ప్రతినిధుల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. వరంగల్ నుంచి కడియం కావ్యకి పోటీ చేసే అవకాశం కల్పించిన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు. మాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తుందన్నారు.
Read also: Garlic Prices : రూ.400కి ఎగిసిన వెల్లుల్లి.. ఇప్పుడు రూ.40 కి దిగింది
ప్రజాస్వామ్య బద్ధంగా గెలుపొందిన ప్రభుత్వాలనుకూలదోష కుట్ర బీజేపీ చేస్తుందన్నారు. ఒక కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తి బీజేపీలో చేరితే పునీతుడు అవుతున్నారని తెలిపారు. దేశంలో ముస్లింలకు భద్రత లేకుండా పోతుందన్నారు. దేశంలో దళితుల పైన విపరీతమైన దాడులు పెరిగిపోయాయని తెలిపారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితులు లేవు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నారని అన్నారు. మానభంగాలు చేస్తున్న దళిత క్రిస్టియన్స్ ను ఊచకోత కోసిన ప్రధానమంత్రిలో చలనం లేదన్నారు. బీజేపీ అప్రజాస్వామిక పద్ధతులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Read also: Putha Chaithanya Reddy: కమలాపురం టీడీపీలోకి వలసలు..
బీజేపీ అక్రమాలను అడ్డుకునే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది ప్రాంతీయ పార్టీలకు ఉన్న శక్తి సరిపోదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. గతంలో ఎమ్మెల్యేగా నేను చేసిన అభివృద్ధిని చూసి ఇక్కడ ప్రజలు నాకు ఓట్లేసి గెలిపించారన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనే ఉద్దేశంతో పార్టీ మారక తప్పలేదన్నారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీని వెళ్లడం కొత్త నాకు బాధగానే ఉందన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం ఉందన్నారు. చాలామంది పార్టీలు మారిన బి.అర్ ఎస్ ఎవరూ స్పందించలేదు.. కానీ నాపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారని తెలిపారు.
Read also: Delhi Capitals: రాజాంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సందడి.. విద్యార్థులతో దాదా ముచ్చట్లు!
దయాకర్ రావు మీరు గుర్తు పెట్టుకోండి మీ అహంకారాన్ని తగ్గించుకోండి.. మీ బలుపు మాటలే మిమ్మల్ని పొడుస్తాయన్నారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే అభివృద్ధి చేస్తే మీ మనవరాలు వయసున్న అమ్మాయి వయసులో ఎలా ఓడిపోయావు అని కీలక వ్యాఖ్యలు చేశారు. పళ్ళ రాజేష్ రెడ్డి నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాల్సి ఉంటుందన్నారు. అవినీతిపరున్ననే అక్రమాలకు పాల్పడ్డానని చెప్పిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధారం బయటపెట్టాలని తెలిపారు. ఆధారాలు బయట పెట్టకపోతే జనగామ చౌరస్తాలో నిన్ను బట్టలు పిన్నులు పెట్టాల్సి వస్తుందన్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ అక్కడ ప్రజలు తొక్కితే పేగులు బయటకు వచ్చి ఓడిపోయావన్నారు. నువ్వారా మా ఇంటికి వచ్చి మా ఇంటి ముందట చావు డబ్బు కొట్టేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మీద విమర్శలు చేస్తున్న నాయకుల బండారాలు బయటపడితే కనీసం తలెత్తుకొని లేని పరిస్థితులు వాళ్లకు వస్తాయన్నారు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావు అంటే నాకు గౌరవం ఉందన్నారు. వారికి ఎన్నోసార్లు చెప్పాను పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టట్లేదు కార్యకర్తలు పట్టించుకోవట్లేదు అని చాలాసార్లు వారి దృష్టికి తీసుకెళ్లారు ఆయన పట్టించుకోలేదన్నారు. ఎన్నికల తర్వాత కూడా పార్టీ నిర్మాణమైన దృష్టి పెట్టాలని వారికి చెప్పిన కాని వాళ్లు పట్టించుకోలేదన్నారు. దళితుల పోయిన దాడులు చేస్తూ హత్యలు చేస్తూ మానభంగాలు చేస్తూ చర్చిలపైన దాడి చేస్తూ చర్చిలను తగలబెడుతున్న బీజేపీకి మద్దతు ఎలా ఇస్తావు మంద కృష్ణ? అని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ అంబేద్కర్ వాదాన్ని వదిలిపెట్టాడన్నారు. విలువల గురించి మాట్లాడే హక్కు బి అర్ ఎస్ నేతలకు లేదన్నారు. అప్పుడు బీఆర్ఎస్ చేస్తే సరైంది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పా? అని ప్రశ్నించారు.
Maheshwar Reddy: కేకే కడిగిన ముత్యం.. రామ్మోహన్ ఆనిముత్యం..