Fake Doctors: నకిలీ వైద్యులు, RMP, PMP వ్యవస్థ పైన ఉక్కుపాదం మోపారు టీఎస్ఎంసీ అధికారులు. ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారిగా NMC చట్ట ప్రకారం 19మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదయ్యయి. ఈ చట్టం ప్రకారం మొదటిసారి 5 లక్షల ఫైన్, ఒక సంవత్సరం జైలుశిక్ష… విధించింది. ప్రథమ చికిత్స కేంద్రాల ముసుగులో ఇబ్బడి ముబ్బడిగా ఆంటిబయోటిక్స్, స్టెరాయిడ్ , షెడ్యూల్ H డ్రగ్స్ , నార్కోటిక్ డ్రగ్స్ రాసే ఎవ్వరిని ఉపేక్షించబోమని టీఎస్ఎంసీ అధికారులు తెలిపారు.
Read also: Maheshwar Reddy: కేకే కడిగిన ముత్యం.. రామ్మోహన్ ఆనిముత్యం..
డిస్ట్రిక్ట్ యాంటీ క్వకరీ వ్యవస్థల ఏర్పాటుతో మరిన్ని దాడులకు స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. సేవ ముసుగులో నకిలీ వైద్య వ్యవస్థలు ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. కమిషన్ల కోసం నూతనంగ హాస్పిటల్ ఓపెన్ చేసిన క్వాలిఫైడ్ డాక్టర్లే లక్షంగా బెదిరిస్తూ.. బరితెగిస్తున్నాయని అన్నారు. గ్రామాల్లో అత్యవసర వైద్యం అందిస్తుంన్నం అంటూ 75-80 శాతం నకిలీ వైద్యులు Rmp, PMP వ్యవస్థ పట్టణాల్లోనే తిష్టవేశారని అన్నారు. గ్రామాలల్లో PHC లో పని చేసే డాక్టర్ల పైన కూడా అవాకులు, చెవాకులు చెప్పి ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న Rmp, పీఎంపీ, నకిలీ వైద్య వ్యవస్థపై చర్యలు తప్పవని అన్నారు.
Read also: AP Schools Summer Holidays: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఉత్తర్వులు జారీ.. ఎప్పటి నుంచంటే..?
గతంలో ఇటువంటి కేసులు నమోదు చేయక పోవడం, గతంలో అధికారుల అండదండలతోనే నకిలీ వైద్యులు, Rmp, Pmp లు ఎటువంటి విద్యార్హత, అనుమతి లేకుండా పుట్టుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి లేకుండా ల్యాబ్ లు , ఫార్మసీ ల నిర్వహణ, టెస్టులు చేయకుండానే రిపోర్టులు ఇస్తున్న వైనం వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఎటువంటి పరికరాలు లేకుండానే ల్యాబ్ ల నిర్వహణ చేస్తున్నారని అన్నారు. NMC చట్టం ప్రకారం వారు ఎటువంటి వైద్యం, వైద్య పరీక్షలు నిర్వహించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ సహకారం తో కేరళ, తమిళనాడు, కర్ణాటక ఆ రాష్ట్రాల వైద్య మండలి నకిలీ వ్యవస్థ నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు.
Read also: India- Pakistan Relation: ఎన్నికల తర్వాత భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడతాయి..
తెలంగాణలో కూడా నకిలీ, RMP, పీఎంపీ వైద్య వ్యవస్థ ప్రక్షాళన చేసేవారికి విశ్రమించామని స్పష్టం చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీ లు వారి జిల్లా స్థాయి మీటింగుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వసూళ్ల దౌర్జన్యం చేస్తున్నారని అన్నారు. మీటింగ్ లకు స్పాన్సర్ చేయకుంటే హాస్పిటల్ , డాక్టర్లపై అసత్యాలు ప్రచారం చేస్తామని.. బెదిరింపులు గురి చేస్తున్న నకిలీ వైద్య వ్యవస్థ, ఇటీవల వరంగల్ లో నోటీసు అందుకున్న ఒక వైద్యుడి కన్నీటి పర్యంతం అయ్యారని తెలిపారు. కమిషన్ల వల్ల , స్పాన్సర్ చేయడం వల్ల హాస్పిటల్స్ పై నిర్వహణ భారం ,వాటి వల్ల పేద , మధ్య రోగులపై కూడా అదనపు భారం పడుతుందని అన్నారు.
Tamilisai: ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తెలంగాణ మాజీ గవర్నర్..