Bandi Sanjay: సభలో ప్రధానిని ఫాసిస్ట్ అంటే తప్పులేదు.. మరమనిషి అంటే సస్పెండ్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay is serious about Etala Rajender being suspended: నిండు సభలో కేసీఆర్ ప్రధానిని ఫాసిస్ట్ అనుచ్చు కానీ.. ఈటల రాజేందర్ మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. ఇవాళ ఈటెల రాజేందర్ ను స్పీకర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. దీనిపై బండి సంజయ్ ఆగ్రమం ఈటల రాజేందర్ అన్నదాంట్లో ఏం తప్పుందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామన్నారు బండి సంజయ్. నిండు సభలో ప్రధానిని ఫాసిస్ట్ అంటావా..అసలు అసెంబ్లీ నడిపే అర్హత నీకు లేదని మండిపడ్డారు బండిసంజయ్. నిన్నే సస్పెండ్ చేయాలని నిప్పులు చెరిగారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో నిన్నే సస్పెండ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ ను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని వాళ్ళనే మరమనిషి అంటారని మండిపడ్డారు.
read also: Real Estate : రియల్ ఎస్టేట్ లో డౌన్ ట్రెండ్ కు కారణమేంటి.? బ్యాంకులు రియల్ సంస్థలకు లోన్లు ఆపేశాయా.?
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
హామీలను అమలు చేయలేని వాళ్లను మరమనిషి అనడం తప్పా? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ బయట మరమనిషి అన్నందుకే మీకు అంత కోపం వస్తే… అసెంబ్లీలో దేశ ప్రధానిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఫాసిస్టు ప్రధాని అంటే మాకు కోపం రాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించాల్సిన చోట… రాజకీయాలను చర్చిస్తున్న కేసీఆర్ ను ఏమనాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వేదికగా ఫాసిస్టు ప్రధాని అని వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేసీఆర్‌కు అసెంబ్లీని నడిపే అర్హత లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే… మాలో ఒక ఎమ్మెల్యేని ఇప్పటికే జైలుకు పంపించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేని సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని గుర్తుచేశారు. ఆర్టీసీ ఆస్తులను 99 ఏళ్ల పాటు లీజుకిచ్చి, లబ్ది పొందే కుట్రకు తెర లేపారని మండిపడ్డారు. ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా, వాళ్ల ఉసురు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. ఇక్కడ బస్టాండ్ నిర్మిస్తానన్న వాగ్దానం ఏమైంది? అని ప్రశ్నించారు. పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల హామీ ఎక్కడికి పోయింది? అని ప్రశ్నల వర్షం కురిపంచారు.
87 Year Old Dials Helpline: హెల్ప్ సెంటర్‌కు 87 ఏళ్ల బామ్మ ఫోన్.. మా ముసలోడు ఆగడంలేదని ఫిర్యాదు..!
తాజావార్తలు
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి