బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు గృహనిర్బంధం చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేబీఎస్ వద్ద నిరసనకు బండి సంజయ్ పిలుపు నిచ్చారు. దీనిలో భాగంగా జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లకుండా మందస్తుగా బండి సంజయ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పోలీసులు చుట్టుముట్టి బండి సంజయ్ బయటకు రాకుండా అడ్డుకున్నారు.…