Bandi Sanjay: మోడీ లేకపోతే.. భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కరీంనగర్ బీజేపీ మహా బైక్ ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో ముస్లిం జనాభా 43 శాతం పెరిగిందన్నారు. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. మోడీ లేకపోతే భారత్ మరో పాకిస్తాన్ లా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని ఇస్లాం సంస్థలు భారత్ ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర చేస్తున్నయ్ అన్నారు.
Read also: Dr. K Laxman: దేశంలో రాజకీయ పార్టీలు వారి కుటుంబాల కోసం పని చేస్తున్నారు..
Also Read
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
నేను…. ‘హమ్ దో.. హమారే దో’ విధానానికి ఓటేస్తా.. (మేమిద్దరం..మాకిద్దరనే కుటుంబ నియంత్రణ విధానానికి ఓటేస్తం) అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలిస్తే.. ‘‘హమ్ చార్.. హమారే చాలీస్’’ (మేం నలుగురం…40 మంది పిల్లల్ని కంటాం అనే విధానం) అవుతుందన్నారు. కేసీఆర్ దేశద్రోహి…ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికపోతారనే భయంతో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను కూడా ధ్వంసం చేశారన్నారు. కేసీఆర్ లాంటి దేశద్రోహిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన దేశభద్రత డేటా, దేశద్రోహంపై కేంద్రానికి నివేదిక ఎందుకు పంపలేదు? అని మండిపడ్డారు.
Read also: KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..
రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే.. కేసీఆర్ ను బొక్కలో వేసే వాళ్లం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌజ్ లో గుసాయించి సర్జికల్ స్ట్రయిక్ చేసి దేశద్రోహులను ఏరిపారేసేవాళ్లం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రయిక్ జరిగిందనడానికి ఆధారాలేంటని రేవంత్ రెడ్డి జవాన్లను అవమానిస్తున్నాడన్నారు. రేవంతన్నా… సరిహద్దుకు తీసుకుపోతా రా… సర్టికల్ స్ట్రయిక్స్ ఎట్లా చేసారో జవాన్లే నీకు రుచి చూపిస్తరని సవాల్ విసిరారు. మోడీ లేని భారత్ ను ఊహించుకోలేమని.. హీరో అని నువ్వే మోడీని పొగిడిన సంగతి మర్చిపోయినవా రేవంతన్న అంటూ గుర్తు చేశారు.
Read also: Ponnam Prabhakar: బండిసంజయ్ మత రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్ ఫైర్
సౌతిండియన్లు, ఆఫ్రికన్లలాగా ఉంటామని (శ్యాంపిట్రోడాను ఉద్దేశించి) కాంగ్రెసోళ్లు అవమానిస్తుంటే ఊరుకుందామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల్లో 60 శాతం వాటాను స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపేయండి అన్నారు. నన్ను ఓడించేందుకు ఏబీసీ(అసద్, బీఆర్ఎస్, కాంగ్రెస్) గ్యాంగ్ ఒక్కటైనయ్ అన్నారు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని కేసీఆర్ పిలుపునిస్తున్నడన్నారు. హిందూ బంధువులారా… కరీంనగర్ కు తరలివచ్చి నన్ను గెలిపించి మీ దమ్మేందో ఏబీసీ చూపించండి అన్నారు.
Akbaruddin Owaisi: మోడీ పేరుతో ఓట్లు రావడం లేదు.. అందుకే నాపేరు వాడుతున్నారు..
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!