Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- ఇండోనేషియాలో భారీ భూకంపం
- 7.7 తీవ్రతతో ప్రకంపనలు
- సునామీ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia Earthquake:ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఫ్లోరెస్ దీవిని శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం లేదు.
10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం
అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:58 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఫ్లోరెస్ దీవిలోని ఎండే నగరానికి ఉత్తర-వాయువ్య దిశలో 68 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read
- Saudi Arabia: మసీదులో ముద్దు పెట్టుకుంటే మరణశిక్షనా.? సౌదీ శిక్షపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం..
- Kenya Cult: ‘‘ఏసుక్రీస్తును కలుస్తారని ఉపవాసం’’.. 191 మంది హత్యల కేసులో దోషిగా పాల్ మెకెంజీ..
- Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
- Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
సునామీ హెచ్చరిక.. ప్రజల తరలింపు
భూకంపం తీవ్రత దృష్ట్యా ఇండోనేషియా అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఫ్లోరెస్ దీవిలోని మౌమెరే పట్టణంలో ప్రజలను అప్రమత్తం చేసి, ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతంలో ఇప్పటికే 19 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు గల సునామీ అలలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోనేషియా వాతావరణ, వాతావరణ శాస్త్ర, భూభౌతిక సంస్థ (BMKG) భూకంప, సునామీ విభాగం డైరెక్టర్ విజయాంతో మాట్లాడుతూ.. ఈ భూకంపం కారణంగా ఈస్ట్ నుసా టెంగారా, సౌత్ సులవేసి, వెస్ట్ నుసా టెంగారా ప్రావిన్సుల్లో సునామీ వచ్చే అవకాశం ఉందని మోడలింగ్ ఫలితాలు సూచిస్తున్నాయని తెలిపారు.
స్థానికుల్లో భయాందోళనలు
భూకంపం కారణంగా స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. భవనాలు దెబ్బతిన్నట్లు చూపించే కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండోనేషియా తీర ప్రాంతంలో సముద్రపు నీరు వెనక్కి వెళ్లిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఖాతాలు భూకంపం కారణంగా భవనాలు కూలిపోయాయని పేర్కొన్నప్పటికీ, ఆ వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేమని సమాచారం. 31 ఏళ్ల ఆసుపత్రి కస్టమర్ సర్వీస్ ఉద్యోగి లుకాస్ లోటార్ మాట్లాడుతూ, భూమి ఒక్కసారిగా కంపించడంతో తాను తీవ్రంగా భయపడ్డానని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారని, గోడలకు పగుళ్లు కనిపించాయని చెప్పారు.
ఇండోనేషియాలో తరచూ భూకంపాలు
ఇండోనేషియా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని “రింగ్ ఆఫ్ ఫైర్” పరిధిలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. జపాన్ నుంచి ఆగ్నేయాసియా మీదుగా పసిఫిక్ బేసిన్ వరకు విస్తరించిన ఈ ప్రాంతంలో భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి.
2004లో భారీ విషాదం
ఇండోనేషియాలో 2000 సంవత్సరం తర్వాత సంభవించిన అత్యంత ప్రాణాంతక భూకంపాల్లో 2004 సుమత్రా భూకంపం ఒకటి. అప్పట్లో సుమత్రా తీరానికి సమీపంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించి భారీ సునామీకి దారితీసింది. ఆ విపత్తులో ఇండోనేషియాతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 2.2 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో పరిస్థితిని అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..