బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌కు అస్వస్థతకు లోనైయ్యారు. 11 రోజులుగా మండు టెండలో పాదయాత్ర చేస్తుండటంతో వడదెబ్బ, ఎసిడిటీ (Acute Gastroenteritis) లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. పాదయాత్ర లంచ్ శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో డాక్టర్లు చికిత్స చేస్తున్నారు. పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అయితే పాదయాత్ర చేసేందుకే బండి సంజయ్ మొగ్గు చూపినట్లు సమాచారం. డీహైడ్రేషన్, ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా వున్నారు డాక్టర్ శరత్ వెల్లడించారు. బండి సంజయ్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.