తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నా జరిగింది. ఈ ధర్నాసభలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను, ఫామ్ హౌస్‌ను లక్ష నాగళ్లతో దున్నుతామని, ఆ భూమిని ప్రజలకు పంచుతామని అన్నారు. పోడు భూములను పరిష్కరిస్తామని చెప్పిన కేసీఆర్, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దళితులకు మూడు ఎకరాల భూమిని ఇస్తామని చెప్పిన కేసీఆర్, ఒక్కొక్క దళితుడికి రూ.10 లక్షలు కాదు, రూ.30 లక్షలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో 18శాతం ధళితులు ఉన్నారని, వారిలో ఏ ఒక్కరికీ ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు లేవా అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత ప్రగతి భవన్‌లో 125 అడుగుల అంబెద్కర్ విగ్రహం ఏర్పాలు చేస్తామని అన్నారు. కేసీఆర్ ఫేక్ ఐడీలు సృష్టించి దళితులను మోసం చేస్తున్నారని అన్నారు.
Read: స్టాండప్ రాహుల్ : “అలా ఇలా…” లిరికల్ వీడియో సాంగ్