Nared Met Orphanage: హైదరాబాద్ లోని బంజారాహిల్సా్ డి.ఏ.వీ స్కూల్ ఘటన మరువక ముందే భాగ్యనగరంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రేస్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం సమా ఘటన వెలుగులోకి వచ్చింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్ లోని గ్రేస్ అనాదాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న నాడు నలుగురు బాలికలు తమ అనాధాశ్రమం నుంచి కనిపించకుండా పోయారని నేరేడ్మెట్ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేసారు అనాధన ఆశ్రమ నిర్వాహకులు.
Read also: Sadar Festival: నేడు, రేపు వైభవంగా సదర్ వేడుకలు.. ఆకట్టుకోనున్న దున్నరాజుల విన్యాసాలు
నలుగురిలో ఒకరు మేజర్, ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి నేరేడ్ మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించాగా ఇద్దరు బాలికలు సికింద్రాబాద్ లో దొరికాగా, మరో ఇద్దరు రెండు రోజులు తరువాత వారి బంధువుల ఇంట్లో దొరికినట్లు సమాచారం అనంతరం పోలీసులు వీరిని కౌన్సిలింగ్ కొరకు సఖి సెంటర్ కు తరలించగా అసలు విషయం తెరపైకి వచ్చింది. రేప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈవిషయం తెలుసుకున్న సఖి సెంటర్ నిర్వహకులు ఖంగుతిన్నారు. అదే అనాధాశ్రమంలో అకౌంటెంట్ గా పని చేస్తున్న మురళి అనే యువకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, భరించలేక అక్కడినుంచే అందుకనే తమకు అక్కడ ఉండటం ఇష్టం లేక తప్పించుకునే ప్రయత్నం చేసామని మినార్ బాలిక సఖి సెంటర్ లో తెలిపినట్లు సమాచారం. దీంతో.. మైనర్ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి గ్రేస్ ఆర్ఫన్ హోం నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
Himachal Pradesh Polls: జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలోకి కాంగ్రెస్ మాజీ నేత విజయ్ మంకోటియా