Sadar Festival: దున్నరాజుల విన్యాసాలు వీక్షకుల హర్షధ్వానాల మధ్య నేటి నుంచి మహానగరంలో సదర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత రెండో రోజు సదర్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే నిన్న గ్రహణం వుండటంతో.. సదర్ ఉద్సవాలను నేడు, రేపు చేయాలని నిర్వహకులు నిర్ణయించారు. హర్యానా, పంజాబ్‌ల నుంచి ప్రత్యేక దున్నపోతులను నగరానికి తీసుకొచ్చారు. ఈసారి శ్రీకృష్ణ, గరుడ, రాజు, సర్తాజ్, ధారా, సుల్తాన్ లవ్ రానా, షారూఖ్, కమాండో, బాహుబలి, బలరామ్, వీర తదితరులు సంబరాల్లో సందడి చేయనున్నారు. నేడు, రేపు (26, 27) నగరంలోని ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, కాచిగూడ, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, చప్పల్‌బజార్, మధురానగర్, కార్వాన్, పాతబస్తీ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
డీజేలు నిషేధం..
సదర్ ఉత్సవ్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర సూచించారు. మంగళసారం సీసీఎస్ సమావేశ మందిరంలో సదర్ ఉత్సవాల నిర్వహణపై యాదవ సంఘం నాయకులతో పోలీసు, పశువైద్య శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయవద్దని, 108 అత్యవసర వాహనాలు అందుబాటులో ఉంచాలని, మొబైల్ టాయిలెట్లు, వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండాలని, వలంటీర్లను ఏర్పాటు చేయాలని డీసీపీ సూచించారు.
Read also: Karthika Masam 2022: తెలుగు రాష్ట్రాల్లో కార్తిక శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
దున్నరాజుల ప్రత్యేకతలు:
గరుడ: రూ.35 కోట్ల విలువైన గరుడ దున్న. దీని బరువు 1854 కిలోలు, పొడవు ఏడు అడుగులు.
సర్తాజ్: ఇది హైదరాబాద్ దున్నరాజు. దీని యజమాని అఖిల భారత యాదవ మహాసభ స్టేట్ జనరల్‌సెక్రటరీ ఎడ్ల హరిబాబుయాదవ్. హర్యానా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 25 సార్లు అనేక చాంపియన్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీని విలువ రూ.16 కోట్లపైమాటే
కింగ్: ఇది పంజాబ్‌కు చెందినది. 1600 కేజీల బరువు, ఆరున్నర అడుగుల ఎత్తు, 7.2 ఫీట్ల పొడవు, 15 ఫీట్ల వెడల్పు. చూడటానికి గాంభీరంగా దర్శనమిస్తుంది. సదరు విన్యాసాలను ప్రదర్శించడంలో దిట్ట. ఇది హైదరాబాద్‌కు చెందినది. దీని వయస్సు నాలుగున్నర ఏండ్లు.
భీమ్: ఇది హర్యానాకు చెందినది. సెప్టెంబర్ 31న నగరానికి వచ్చింది. 1600 కేజీల బరువు, 7.5 ఫీట్ల పొడవు, 15.6 ఫీట్ల వెడల్పు ఉంటుంది.
ధారా: దీని బరువు 1400కేజీలు, పొడవు 6.5 ఫీట్లు, వెడల్పు 14.5 ఫీట్లు ఉంటుంది.
అర్జున్: దీని వయస్సు నాలుగేండ్లు. హర్యానా నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనుగోలు చేసి తీసుకువచ్చారు. దున్న పొడవు 6 ఫీట్లు, వెడల్పు 14 ఫీట్లు, బరువు 1500 కేజీలు ఉంటుంది.
శ్రీకృష్ణ: ఇది హర్యానాకు చెందినది. దీని వయస్సు 5 ఏండ్లు. బరువు 1800 కిలోలు, 7 అడుగుల ఎత్తు, 18 అడుగుల పొడవు. అత్యంత బలీష్టమైనది.
Astrology : అక్టోబర్ 26, బుధవారం దినఫలాలు