రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ నిన్న పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు అండగా ఉండాలని చెప్పిన సీఎం కేసీఆర్… రైతు బీమా తరహాలోనే చేనేత బీమా పథకం తీసువస్తున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా వర్తింప జేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
read also : ఏపీ మంత్రులపై జేసీ సంచలన వ్యాఖ్యలు..
అయితే.. చేనేత బీమా పథకాన్ని ప్రకటించిన సందర్భంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ కార్యక్రమం కర్నాటి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది. చేనేత కార్మికులకు అండగా నిలస్తూ.. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మాజి ఎమ్మెల్సి శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్, మచ్చ సుధాకర్, చెరుకు స్వామి తదితరులు పాల్గొన్నారు..