ప్రతి ఏటా దసరా సందర్భంగా బండారు దత్తాత్రాయే నిర్వహించే కార్యకమంలో ఒకే వేదికపై మా అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. రెండు వర్గాల మధ్య పోటాపోటీ గా జరిగిన మా ఎన్నికల అనంతరం వీరు ఇలా కనిపించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అలయ్-బలయ్ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి, వెంకయ్యనాయడు, బీజేపీ అధినేత బండి సంజయ్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సారి దత్తాత్రేయకు అనారోగ్యంతో ఉండటంతో ఈ కార్యక్రమాన్ని ఆయన కూతురు నిర్వహించారు. అయితే పవనతో మాట్లాడాటానికి ప్రయత్నించిన స్పందించలేదని ట్విట్టర్ వేదికగా నెటిజన్లు ట్రోల్స్ చేయడంతో ఈ రోజు విష్ణు ఇద్దరూ కలిసి ఉన్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇద్దరూ ఒకే వేదికపై కాసేపు ముచ్చటించడంతో మా ఎన్నికల్లో జరిగిన రచ్చ, పవన్ కళ్యాణ్ పై విష్ణు చేసిన కామెంట్స్ తో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు.
మా మధ్య విబేధాలు లేవు..
ఇదిలా ఉంటే మంచు విష్ణు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో తమకు ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేశారు. స్టేజీ మీద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఉండటంతో పెద్దగా మాట్లాడుకోలేదన్నారు. మేమంతా ఒక్కటేనని విష్ణు తెలిపారు. మా ఎన్నికల సందర్భంగా చిరంజీవి తనను తప్పుకోమన్నారని విష్ణు గతంలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
What really went down 😎. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021