MIM Akbaruddin Owaisi: ఉర్దూకి అన్యాయం.. పాతబస్తీలో మెట్రో సంగతి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MIM Akbaruddin Owaisi: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నగర అభివృద్ధి పై ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉర్దూకు రెండవ అధికార భాషా తెలంగాణ సర్కార్ ఇచ్చిందని, కానీ ఉర్దూకు ఇప్పటికీ అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణం ఏ స్టేజిలో ఉందో చెప్పాలని శాసన సభలో ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేస్తే అభినందనలు చెబుతాం…పనులు కాక పోతే మాట్లాడతామన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలు కడుతున్నారు. మంచిదే… మరి హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి ఎంటి ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి… పాతబస్తీ లో ఆ స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఇంకా ఎంత కాలం కావాలి ? అని ప్రశ్నించారు అక్బరుద్దీన్. పాతబస్తీ లో మెట్రో సంగతి ఎంటి ? అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ లో ప్రభుత్వం హామీలు ఇస్తుంది …వాటిని అమలు చేయదా ? అన్నారు. సీఎం కేసీఅర్, మంత్రులు బిజీగా ఉంటారు..మాకు తెలుసు, మీరు చప్రసి అయిన చూపించండి.
Read also: Telangana Assembly: కేంద్ర బడ్జెట్ లో ఐఐటీ, గిరిజన యూనివర్సిటీ ఊసేలేదు
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
తెలంగాణ కోసం, పాతబస్తీ వారిని అయిన కలుస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడుపుతున్నారు. నేను BAC సమావేశంకు రాలేదు… లెటర్ పంపాను…కేసీఅర్ కూడా రాలేదు మీటింగ్ కు అన్నారు. నొట్ల రద్దు , GST కి మద్దతు వద్దు అన్నామని, కేసీఅర్ ఏమి కాదు…అంతా మంచి జరుగుతుంది అన్నారు. ప్రధాన మంత్రి నీ అలా అనడం సరికాదని కేసీఅర్ ..నన్ను అన్నారని తెలిపారు. అన్యాయం జరుగుతోందని మొదటి నుంచి మేము చెబితే సీఎం అలా జరగదని అన్నారు. భాజపాకు మద్దతిచ్చారు, రాష్ట్రానికి ఏమి వచ్చింది ? అంటూ ప్రశ్నించారు అక్బరుద్దీన్. BRS పెట్టినందుకు అభినందనలు. మమ్మల్ని బీ టీమ్ అన్నారు… ఇప్పుడు మీరు జాతీయ స్థాయిలో వెళ్లారు. ఏ టీమ్ అంటారో? రెండు పార్టీలు మాత్రమే ఉండాలని కొందరు అనుకుంటారని సెటైర్ వేశారు. పాత బస్తిని ఇస్తాంబుల్ చేస్తామని కేసీఅర్ అన్నారు …కానీ ఉన్న స్థాయిలో అభివృద్ధి చేయండని అన్నారు. హైదరాబాద్ నగరంలో నేరాలు పెరుగుతున్నాయి.. 70 శాతం సిసిటివి కెమేరాల నిర్వహణ సరిగ్గా లేదని మండిపడ్డారు. రైతు రుణ మాఫీ చేయండి, హైదరాబాద్ పాతబస్తీ లో మెట్రో పూర్తి చేయండని కోరారు. PRC ఎప్పుడు ఇస్తారు ? కొత్త నగరంలా …పాతబస్తీ నీ అభివృద్ధి చేయండని తెలిపారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారు … అమలు చేయండి అని అక్బరుద్దీ శాసన సభలో ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!