Crime: అధికారులు ఎన్ని కట్టుదిట్టమై చర్యలు తీసుకున్న బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నిస్తున్న కేటుగాళ్లని చాకచక్యంగా పట్టుకుంటున్నారు అధికారులు.అయితే హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కేసులు నిత్యం వెలుగు చూస్తున్నాయి. నిన్న డిటర్జెంట్ సర్ఫ్‌లో బంగారాన్ని ఉంచి అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన స్మగ్లర్స్ ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుండి దాదాపు కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే బంగారం అక్రమంగా రవాణా చేస్తూ ప్రయాణికుడు అధికారులకు పట్టుబడ్డాడు అనే మరో వార్త శంషాబాద్ విమానాశ్రయంలో మళ్ళీ వెలుగు చూసింది. వివరాలలోకి వేళ్తే.. రియాద్ అనే వ్యక్తి మస్కట్ మీదుగా ఒమన్ ఎయిర్‌లైన్స్ (ఫ్లైట్ నెం. WY-0231, ) లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
Read also:World Mental Health Day: ప్రపంచం మానసిక ఆరోగ్య దినోత్సవం.. అసలు ఈ రోజు ఎలా వచ్చింది..
ఈ నేపథ్యంలో అతను అనుమానాస్పదంగా తిరగడం గమనించిన హైదరాబాద్ CIW (CISF) ప్రత్యేక బృందం అధికారులు అతనిని విచారించి తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రయాణికుడి దగ్గర 2 బంగారు బిస్కెట్లు, 01 బంగారు చైన్ ఉన్నట్లు CISF అధికారులు గుర్తించారు. వెంటనే ఆ ప్రయాణికుడి దగ్గర ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు CISF అధికారులు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసిన CISF అధికారులు, స్వాధీనం చేసుకున్న బంగారం తోపాటుగా అతని వస్తువులు అలానే అదుపులోకి తీనుకున్న ప్రయాణికుడిని RGIA కస్టమ్స్ (AIU)కి అధికారులకు అప్పగించారు ..