World Mental Health Day: మనిషి ఎప్పుడు ఉత్సహంగా ఉండాలి అంటే మనసు ఉత్సహంగా ఉండాలి.. అయితే ప్రస్తుతం మనిషి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాడు.. నిద్రలేచింది మొదలు పడుకునే వరకు యంత్రంలా పని చేస్తున్నాడు. దీనితో ఒత్తిడికి లోనవుతున్నాడు. ఉద్యోగులే కాదు విద్యార్థులు కూడ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కొందరు ఈ ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ అనార్ధాలనింటికి కారణం మానసిక ఆరోగ్యం బాగుండకపోవడమే. కాని మనం మానసిక ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోము. కాని మనిషి శారీరక ఆరోగ్యం బావుండాలి అంటే కచ్చితంగా మానసిక ఆరోగ్యం బావుండాలని చెప్తున్నారు ఆరోగ్యం నిపులు. మానసిక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఉంది అంటే మానసిక ఆరోగ్యం పైన అవగాహన కల్పించేందుకు ప్రంపంచవ్యాప్తంగా అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచం మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు.
Read also:Navdeep: నేడు ఈడీ విచారణకు హీరో నవదీప్… లావాదేవీలపై ఆరా తీయనున్న అధికారులు
తొలిసారిగా 1992లో 150కి పైగా దేశాలకు చెందిన సభ్యులున్న ప్రపంచ మానసిక ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఈ దినోత్సవం నిర్వహించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ప్రజలలో మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిపించడం. తద్వారా ఒత్తిడిని తగ్గించి ప్రజలలో చైతన్యం పెంపొందించడం. ఏపని చెయ్యాలనుకున్న మన మనసు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మన మెదడు చురుగ్గా పనిచేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకునేదుకు అద్భుతమైన మార్గం ధ్యానం. ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారడమే కాదు.. రోజంతా మనిషి ఉత్సహంగా ఉంటాడు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.