Alcohol intoxication: కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న పనులకు పిల్లలపై విసిపోయి వారిపై అతి కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. కన్న బిడ్డలను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే వున్నాయి. మద్యం మత్తులో ఇలాంటి దారునాలు మరింతగా పెరుగుతున్నారు.
read also: Nota in Second Place: ఉపఎన్నికల్లో విచిత్రం.. నోటాదే రెండో స్థానం
హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కన్న కొడుకును సొంత తండ్రే కాటికిపంపించాడు. రెండేళ్ల బాలుడి ఏడుస్తున్నాడనే కోపంతో అతికిరాతకంగా కొట్టి హతమార్చాడు. మద్యం మత్తులో కొడుకును చంపాడని తెలుస్తోంది. హైదరాబాద్ లోని నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. నేరేడ్మెట్ జే జే నగర్ లోని ఎస్.ఎస్.బి క్లాసిస్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా నివసించే దివ్య, సుధాకర్ దంపతులు. 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. దివ్య సుధాకర్ కి 2సం: కుమారుడు ఉన్నాడు. సుధాకర్ రాత్రి తప్పతాగి ఇంటికి రాగా.. ఇంట్లో రేడేళ్ల కుమారుడు ఏడుస్తూ కనిపించాడు. సుధాకర్ తన కొడుకు బుజ్జగించినా ఇంకా ఏడుస్తూనే ఉండటతో కొడుపుపై కోపంతో దారుణంగా కొట్టాడు మద్యం మత్తులో బాలుడు జీవన్ ని తీవ్రంగా కొట్టడంతో జీవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. భయాందోళన చెందిన తల్లి నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుధాకర్ ను అదుపులో తీసుకున్నారు. విచారణ చేపట్టారు.
The Gun Misfired: గన్ మిస్ ఫైర్ కావడంతో కానిస్టేబుల్ కు గాయాలు.. పరిస్థితి విషమం