Rowdy Sheeter: హైదరాబాద్ సనత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో ఫిరోజ్ అనే ఒక రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.. తెల్లవారు జామున కళ్లల్లో కారం కొట్టి కతులతో కిరాతకంగా హత్య చేసిన ఘటన 2021లో సంచలన సృష్టించింది. అయితే ఇప్పుడు మళ్లీ బోరబండలోనే నదీమ్ అనే రౌడీ షీటర్ ను అతికిరాతకంగా హత్య చేసారు గుర్తు తెలియని వ్యక్తులు. నదీమ్ ను విగత జీవిగా చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన హత్యకు గురైన ఫిరోజ్ ఇంటికి వెళ్లారు. నదీమ్ కు కొందరు ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నదీమ్ పై ఆగంతకు దాడికి ప్రయత్నించారని కుటుంబ సభ్యులు పోలీసులకు సమచారం అందించారు.
Read also: Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్టేట్.. నేటి నుంచి వచ్చే మూడ్రోజులు వర్షాలే
అయితే ఇప్పుడు ఇంటి దగ్గర మాటు వేసి ఉదయం నదీమ్ బయటకు రాగానే ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారని అన్నారు. దీంతో నదీమ్ కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశారు. దీంతో నదీమ్ కుటుంబ సభ్యులు, స్థానికులు ఏం జరుగుతుందో అంటూ బయటకు పరుగులు పెట్టారు. అయితే నదీమ్ రక్తపు మడుగులో విగత జీవితగా పడి విలవిలలాడుతున్నాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు నదీమ్ రక్తపు మడుగులో చూసి షాక్ తిన్నారు. నదీమ్‌ను చేతిలో తీసుకుని కన్నీరుమున్నీరయ్యారు. నదీమ్‌ను కాపాడే ప్రయత్నంలోనే కుటుంబసభ్యుల చేతుల్లోనే కన్నుమూసాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Hyderabad Metro: మెట్రో బంపరాఫర్.. రూ. 59తో అపరిమిత ప్రయాణం..