YS Sharmila: కేసీఆర్‌లాంటి అహంకార సీఎం చరిత్రలో లేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అంతటి అహంకార ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆమె ట్విటర్ వేదికగా కేటీఆర్, కేసీఆర్‌లపై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు.. అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? నాడు మహానేత వైయస్ఆర్ గారు రచ్చ బండలో ప్రజల ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజా ప్రభుత్వానికి చిరునామాగా నిలిస్తే.. క్యాంప్ ఆఫీస్‌లోనే ప్రజా దర్బార్ పెట్టి ప్రతి సమస్యను వింటే..
Also Read: Karachi Fire Accident: షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి!
Also Read
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
నేడు కేసీఆర్ చేస్తున్నది నియంత పాలన. ఓట్లేసిన పాపానికి జనాలకు కష్టాలు..దొరకు ఫామ్ హౌజ్ వైభోగాలు.అధికార మత్తులో మీకు ప్రజా సమస్యలు కనిపిస్తలే.. ఇండ్లు లేక పేదలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే మీకు కళ్లు కనపడతలే. ధరణి సమస్యలపై రైతుల గోడు వినిపించదు.. ఉద్యోగాలు కావాలని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆకలి కేకలు మీ చెవిన పట్టవు.. సర్కారు బడిలో సౌలతులు లేక పేద బిడ్డలు పడుతున్న బాధలు మీకు కానరావు.. రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని సమస్యల సుడిగుండంలో ముంచారు. మీ పాలనలో ప్రజలకు మిగిలింది కష్టాలు, కన్నీళ్లే.. ముమ్మాటికి మీరు తెలంగాణ ద్రోహులే’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Also Read: Rajasthan Election 2023: స్కూటీపై వచ్చి ఓటేసిన ఎంపీ.. వీడియో వైరల్!
సీఎంను ప్రజలు కలవాల్సిన అవసరం ఏముందంటున్న కేటీఆర్ గారు…అసలు మీకు జనం ఓటు వేయాల్సిన అవసరం ఏముంది? ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకు సేవ చేయడానికా లేక గడీల్లో భోగాలు అనుభవించడానికా? నాడు మహానేత వైయస్ఆర్ గారు రచ్చ బండలో ప్రజల ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కరించి ప్రజా ప్రభుత్వానికి…
— YS Sharmila (@realyssharmila) November 25, 2023
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!