Top 5 Smartphones: ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికేడాది వినియోగదారులు తమ ఫోన్లను మారుస్తున్నారు. ఇది మొబైల్ కంపెనీలకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే కొత్త మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. మార్చి నెలలో లాంచ్‌కి పలు మొబైళ్లు సిద్ధమవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం టాప్ మొబైళ్లపై దృష్టి నెలకొంది.
మార్చిలో వస్తున్న టాప్-5 మొబైళ్లు ఇవే:
Nothing Phone 2a:
సరసమైన ధరల్లో, మంచి ఫీచర్లు, స్టైలిష్ లుక్ కలిగిన ఫోన్లలో నథింగ్ ఒకటి. తాజాగా మార్చి 5న ఈ నథింగ్ ఫోన్ 2a లాంచ్ కాబోతోంది. 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే, డ్యూయల్-కెమెరా మాడ్యూల్, 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు. మీడియా టెక్ డైమెన్సిటీ 7200 SoCపై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14ని కలిగి ఉంది.
Samsung Galaxy A55 5G:
120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల పూర్తి HD+ OLED డిస్‌ప్లేతో రియర్ ట్రిపుల్ కెమెరాతో సామ్‌సంగ్ ఫోన్ రాబోతోంది. ఇది Exynos 1480 SoC ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. మార్చి – ఏప్రిల్ మధ్య స్టోర్‌లో అందుబాటులోకి రావొచ్చని భావిస్తున్నారు.
Xiaomi 14:
ఈ ఫోన్ మార్చి 7న లాంచ్ చేయబడుతోంది. 6.36 ఇంచ్ OLED డిస్‌ప్లేని కలిగి 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ SoCతో రన్ అవుతుంది. దీని ప్రైమరీ కెమెరా 50-మెగా పిక్సెల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ మరియు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది.
Realme 12+ 5G:
రియల్‌మి నుంచి 12+ 5G లాంచ్‌కి సిద్ధమైంది. ఇది రియల్‌మి 12 Pro 5G మరియు రియల్‌మి 12 Pro+ 5Gకి మధ్య ఉంటుంది.
Vivo V30 Pro:
Vivo V30 Pro ఫిబ్రవరి 28 తేదీన వస్తోంది. ఈ ఫోన్ కర్వడ్ 3D డిస్‌ప్లే మరియు ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌తో రాబోతోంది. దీని ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో ఉంటుంది. ఇది MediaTek యొక్క డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌ని కలిగి ఉంటూ.. ఆండ్రాయిడ్ 14తో వస్తోంది.