Top 5 Smartphones: ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాదికేడాది వినియోగదారులు తమ ఫోన్లను మారుస్తున్నారు. ఇది మొబైల్ కంపెనీలకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రోజుల వ్యవధిలోనే కొత్త మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. మార్చి నెలలో లాంచ్‌కి పలు మొబైళ్లు సిద్ధమవుతున్నప్పటికీ అందరి దృష్టి మాత్రం టాప్ మొబైళ్లపై దృష్టి నెలకొంది.