స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో 6000mAh బ్యాటరీతో పాటు 50MP కెమెరా వంటి ఫీచర్లు అందించారు. Realme P3 Pro 5Gలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంది. Realme P3x 5Gలో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఉంది. రెండు హ్యాండ్‌సెట్‌లు Realme UI 6.0 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో Android 15పై పని చేస్తాయి.
Also Read:Hyderabad: నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠా గుట్టురట్టు..
ధర:
Realme P3 Pro 5G ధర విషయానికి వస్తే.. 8GB RAM, 128GB స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్‌కు రూ.23,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లలో వరుసగా రూ. 24,999, రూ. 26,999 ధరలకు లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫిబ్రవరి 25 నుంచి కంపెనీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో సేల్ ప్రారంభమవుతుంది. గెలాక్సీ పర్పుల్, నెబ్యులా గ్లో, సాటర్న్ బ్రౌన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Realme P3x 5G ధర విషయానికి వస్తే.. 6GB + 128GB, 8GB + 128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లకు రూ.13,999, రూ.14,999గా నిర్ణయించింది. ఫిబ్రవరి 28న రియల్‌మి వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్ లో సేల్ ప్రారంభమవతుంది. లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ కలర్స్ లో లభ్యమవుతుంది. సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా Realme P3 Pro 5G కొనుగోలుపై రూ. 2,000 తగ్గింపు, Realme P3x 5Gపై రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు.
Also Read:Satyendra Jain: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రిపై విచారణకు రాష్ట్రపతి అనుమతి
రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5జి స్పెసిఫికేషన్లు
Realme P3 Pro 5G, Realme P3x 5G రెండూ డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌లు. ఇవి ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పై పనిచేస్తాయి. P3 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ ఉంది. P3x 5Gలో డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ అందించారు. Realme P3 Pro 5G 6.83-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ల్పేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. Realme P3x 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.
Also Read:CM Chandrababu: ప్రతిపక్షం లేదని లైట్‌గా తీసుకోవద్దు.. అసెంబ్లీ సమావేశాలపై సీఎం కీలక ఆదేశాలు..
ఫోటోగ్రఫీ కోసం, రియల్‌మి పి 3 ప్రో 5 జిలో సోనీ IMX896 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ముందు భాగంలో, హ్యాండ్‌సెట్‌లో సోనీ IMX480 సెన్సార్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అమర్చబడింది. రియల్‌మి పి3ఎక్స్ 5జిలో 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5జి లలో కస్టమర్లు వరుసగా 256 జిబి, 128 జిబి వరకు ఇన్‌బిల్ట్ స్టోరేజ్ పొందుతారు.
Also Read:Krithi Sanon: నార్తులో గోల్డు.. సౌత్ లో ఐరన్.. పాపం కృతి!
ఈ హ్యాండ్‌సెట్‌లు USB టైప్-C పోర్ట్‌తో పాటు 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ‘మిలిటరీ గ్రేడ్’ షాక్ రెసిస్టెన్స్, దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. రియల్‌మి పి3 ప్రో 5జి, రియల్‌మి పి3ఎక్స్ 5జి రెండూ వరుసగా 80W, 45W చార్జింగ్ సపోర్ట్ తో 6,000 mAh బ్యాటరీని కెపాసిటీ కలిగి ఉన్నాయి.