సౌత్ లో జెండా పాతాలని వచ్చిన భామకు ఇక్కడ చేదు అనుభవం ఎదురై బాలీవుడ్ చెక్కేసింది. నార్త్ బెల్ట్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అయ్యింది. ఇప్పటి వరకు తెలుగు హీరోలకు ఒక్క హిట్టు కూడా లేని భామతో ఫస్ట్ టైం జోడీ కట్టబోతున్నాడు ఆ సౌత్ హీరో. ఆ కథాకమీషు ఏంటో చూద్దాం. నిజానికి మహేష్ వన్ నేనొక్కడినేతో టాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కృతి సనన్ కు ఘోర పరాభవం ఎదురైంది. మహేష్ లాంటి స్టార్ హీరోకు ప్లాప్ అందించి.. అటు నాగ చైతన్యకు దోచేయ్ రూపంలో డిజాస్టర్ ఇచ్చి.. ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ కలిసి రావడం లేదని.. మెల్లిగా బాలీవుడ్ దారి పట్టింది. నార్త్ బెల్ట్ లో చేసిన సినిమాలన్నీ హిట్స్ పడటంతో గోల్డెన్ లేడీగా మారింది.
Undavalli Arun Kumar: పవన్ కల్యాణ్ సాధిస్తారు..! ఏపీకి ఆశాజ్యోతి ఆయనే..
సౌత్ లో ముఖ్యంగా ఒక్క టాలీవుడ్ హీరోతో హిట్టు కొట్టి.. తనపై ఉన్న నెగిటివ్ మార్క్ చెరిపేసుకుందామనుకుంటే.. పాన్ ఇండియా టాలీవుడ్ హీరో ప్రభాస్ కు ఆదిపురుష్ తో ప్లాప్ ఇచ్చి.. తెలుగు హీరోలకు హిట్టు ఇవ్వని భామగా మారిపోయింది. ఇక అక్కడి నుండి సౌత్ హీరోలను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. కానీ తప్పలేదు. తానొకటి అనుకుంటే.. డెస్టినీ మరోటి డిజైన్ చేసిందని.. ఇప్పుడు కూడా మరో సౌత్ హీరో ధనుష్ తో నటించే ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ హీరోలకు అచ్చిరాని బ్యూటీ, కృతి సనన్ తో ఫస్ట్ టైం జోడీ కడుతున్నాడు ధనుష్.తేరే ఇష్క్ మెలో కనిపించబోతున్నారు. రీసెంట్లీ ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది బ్యూటీ. రంజానాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో 12 ఏళ్ల తర్వాత టయ్యప్ అవుతున్నారు ధనుష్. సినిమాను చకా చకా కంప్లీట్ చేసి.. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్. మరీ తెలుగు స్టార్లకు హిట్స్ ఇవ్వని భామతో ధనుష్ యాక్ట్ చేయడం వెనుక రీజన్ దర్శకుడిపై నమ్మకమా..? తనపై తనకు ఉన్న ఓవర్ కాన్ఫిడెన్సా..? అనేది కాలమే నిర్ణయించాలి.