సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ రకమైన స్కామ్‌లో.. మోసగాళ్ళు అన్ని రకాల ప్రజల లక్ష్యంగా చేసుకుని, ఆధార్ కార్డ్ లేదా నకిలీ నంబర్ మిస్ యూజ్ పేరుతో భయపెట్టి ఆపై వారిని డిజిటల్‌గా అరెస్టు చేస్తారు. అటువంటి అరెస్టులు చేసే వ్యక్తులు నిజమైన పోలీసుల వలె నటిస్తారు. తాము ఫోన్ చేసిన వాళ్ల మాటలను కూడా స్పష్టంగా విశ్వసించేలా చేస్తారు. ఆపై అరెస్టు చేస్తామని బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది.. అందులో స్కామర్లు అతనిని ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి ఈ మొత్తం ఘటనను రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నాడు.
స్టెప్-1: ట్రై పేరుతో కాల్..
విజయ్ పటేల్ (విజయగజేర) అనే “ఎక్స్” వినియోగదారు.. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియోతో సహా పంచుకున్నాడు. ఆ యువకుడిని కొత్త నంబరు నుంచి కాల్ వస్తుంది. మోసానికి పాల్పడినందున రాబోయే 4 గంటల్లో వారి మొబైల్ నంబర్ బ్లాక్ చేయబడుతుందని కాల్ చేసిన వ్యక్తి అతనికి చెప్పాడు. ట్రాయ్ పేరుతో స్కామర్ ఈ కాల్ చేశాడు.
స్టెప్-2: వాట్సాప్‌లో స్టేట్‌మెంట్ రికార్డ్..
12 గంటల్లోగా లక్నో పోలీస్ స్టేషన్‌కు చేరుకోవాలని స్కామర్ విజయ్‌ని కోరాడు. అలా రాలేకపోతే.. వాట్సాప్ వీడియో కాల్‌లో స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకునే అవకాశం కూడా వారికి ఇవ్వబడింది. అందరిలాగానే విజయ్ రెండో ఆప్షన్ ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది.
స్టెప్-3: పోలీస్ యూనిఫాంలో ఉన్న స్కామర్..
ఈ కాల్‌లో ఒక వ్యక్తి పోలీసు యూనిఫాంలో కనిపిస్తున్నాడు. దీని వెనుక బ్యాక్ గ్రౌండ్ కూడా ఓ పోలీస్ ఆఫీసర్ ఆఫీస్ లాగానే సెటప్ చేయబడింది. ఈ నకిలీ పోలీసు అధికారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాడు.
4. After receiving a WhatsApp call, I found a scammer in a police uniform and set up like a police station.
This is why most people start to believe that this is a real police case.
Watch this clip to learn how they started. pic.twitter.com/L3eYeQvia0
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-4: పరిసరాలను పరిశీలించడం..
విజయ్‌తో ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి.. పోలీసు డ్రెస్‌లో ఉన్న స్కామర్ 360 డిగ్రీల వీక్షణను చూపించమని విజయ్‌ని అడిగాడు. దీని తర్వాత అతను విజయ్ ఆధార్ కార్డుపై విచారణ ప్రారంభించాడు.
5. To Ensure nobody was with me, he told me to show a 360-degree view with my back camera!
He didn’t know that I am his father! 😉 pic.twitter.com/CsuhPR2BH2
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-5: సుప్రీంకోర్టు పేరు పత్రం..
ఆధార్ కోడ్ గురించి సమాచారం తీసుకున్న తర్వాత.. ఆధార్ ఎలా దుర్వినియోగం అవుతుందో ఆ వ్యక్తి విజయ్‌కి చెప్పాడు. ఇంత.. స్కామర్లు వారికి వాట్సాప్‌లోనే సుప్రీంకోర్టు పేరుతో ఒక పత్రాన్ని కూడా పంపారు. అది చూసిన జనాలు తీవ్ర ఆందోళలనకు గురవుతారు.
6. In the next step, they start to inquire about my Aadhar Card and how we should use it to prevent it from being used illegally! pic.twitter.com/BnPTGn8S67
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-6: విచారణ పోలీసు ప్రధాన కార్యాలయానికి వివరాలు..
తదుపరి దశలో.. నకిలీ పోలీసు విజయ్ గురించి విచారించడానికి వాకీ-టాకీని ఉపయోగించి నకిలీ పోలీసు ప్రధాన కార్యాలయాన్ని కూడా సంప్రదిస్తాడు. దీనిపై అతను విజయ్‌కి సంబంధించిన అన్ని వివరాలను పంచుకున్నాడు.
7. He politely gave instructions on guidelines for using an Aadhar Card and
Meanwhile, they printed a document in the name of the Supreme Court and TRI to give it a more real look! pic.twitter.com/gb5NmaWDCP— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-7: నకిలీ పోలీసు బెదిరింపులు…
దీని తర్వాత అతను విజయ్‌ని బెదిరించే ప్రయత్నం ప్రారంభించాడు. మనీలాండరింగ్‌లో నవాబ్ మాలిక్‌తో తమకు సంబంధం ఉందని స్కామర్ వారికి చెప్పాడు. ఈ విధంగా అతను విజయ్ బ్యాంక్ ఖాతా గురించి సమాచారం అడుగుతాడు. ఇలాంటి సందర్భాల్లో స్కామర్లు ప్రజలను భయపెట్టి వారి నుంచి బ్యాంకు ఖాతా వివరాలను తీసుకుంటారు.
9. Next step is very interesting, he used walky talky to inquire about me in the police headqouter!
His tone changed, and he started to threaten me after the headquarter informed him to arrest me! Hear the whole conversation. pic.twitter.com/HVGYQJuFNl
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-8: బ్యాంక్ వివరాలు..
దీని తర్వాత అతను విజయ్ యూపీఐ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తావా? అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
10. They found my connection with Nawab Malik in a money laundering case!🥲
Actually, this is a trick to know how many bank accounts you have and how much money you have in them so they can clean it!
Listen to this conversation. pic.twitter.com/BKYjdmAAf5— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-9: కాల్ డీసీపీకి బదిలీ..
స్కామర్ ఈ కాల్‌ని నకిలీ డీసీపీకి బదిలీ చేస్తాడు. అతను విజయ్ తన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తాన్ని అతని బ్యాంకుకు బదిలీ చేయమని చెప్పాడు. దీని తర్వాత మాత్రమే అతను నిర్దోషిత్వం యొక్క సర్టిఫికేట్ పొందుతాడని డిమాండ్ చేస్తాడు.
11. Next, he started to inquire about whether I use UPI apps or net banking so they can use this mode to transfer the amount. pic.twitter.com/N2ecQ9Ilky
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
స్టెప్-10: విషయం వెల్లడైంది..
అయితే, విజయ్ తమ ప్లాన్‌ని కనిపెట్టాడని స్కామర్ గ్రహించిన వెంటనే. అతను వారితో తప్పుగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అటువంటప్పుడు.. మోసగాళ్ళు తమ గురించి అవతలి వ్యక్తికి తెలిసిందని గ్రహించిన వెంటనే వారు వినియోగించిన ఫోన్ నంబరును బ్లాక్ చేస్తారు.