నకిలీ VPN యాప్‌లు, ఎక్స్‌టెన్షన్‌లు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొంటూ Google ఇటీవల ఒక కొత్త హెచ్చరికను జారీ చేసింది. ఈ యాప్‌లు వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందాయి. ఉచిత VPNల వినియోగదారులు ప్రమాదంలో ఉన్నారు. అనేక ఉచిత VPN యాప్‌లు వినియోగదారు డేటాను లాగ్ చేస్తాయి, ట్రాకర్‌లను ఇన్‌స్టాల్ చేస్తాయి. నకిలీ సమీక్షలతో వారి ర్యాంకింగ్‌లను పెంచుతాయి అని Google చెబుతోంది. ఇప్పుడు, స్కామ్ గ్రూపులు మాల్వేర్‌ను వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగిస్తున్నాయి. Also…
Vijay Devarakonda : రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను…
Fake Wedding Card Invitation: ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సమయంలో ప్రజలను మోసం చేసేందుకు స్కామర్లు కొత్త ట్రిక్‌కు శ్రీకారం చుట్టారు. సైబర్ మోసగాళ్లు పెళ్లి కార్డులను ఆశ్రయించి మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఒక సలహా జారీ చేసింది. మీ వాట్సాప్‌లో తెలియని వ్యక్తి నుండి అలాంటి వివాహ కార్డు ఏదైనా పంపబడితే, దాన్ని తెరవడానికి ముందు జాగ్రత్తగా ఉండండి. మీరు వెడ్డింగ్ కార్డ్‌ని తెరిచిన…
సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ రకమైన స్కామ్‌లో.. మోసగాళ్ళు అన్ని రకాల ప్రజల లక్ష్యంగా చేసుకుని, ఆధార్ కార్డ్ లేదా నకిలీ నంబర్‌ను మిస్ యూజ్ పేరుతో భయపెట్టి ఆపై వారిని డిజిటల్‌గా అరెస్టు చేస్తారు.
Scammers: దొంగతనాల రూటే మారింది. గతంలో మాదిరిగా ఇళ్లలో నగలు, డబ్బును ఎత్తుకెళ్లడం తగ్గింది. దీని స్థానంలో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండా మన బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ రిపోర్టు ప్రకారం ఏడాది కాలంలో 1.02 ట్రిలియన్ డాలర్ల సొమ్మును కొల్లగొట్టినట్లు తెలిపింది. ఈ అధ్యయనం 43 దేశాలకు చెందిన 49,459 మందిని సర్వే చేసింది. వారు ఎలాంటి మోసాల బారిన పడ్డారు, ఎంత డబ్బు కోల్పోయారనే వివరాలను…
సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది. అంతా స్మార్ట్ ఫోన్లతో రకరకాల యాప్‌లతో బిజీగా మారిపోయారు. సైబర్ స్కాంలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈజీమనీకి అలవాటుపడ్డ వారు వివిధ రకాల మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు టెక్నాలజీ పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించక తప్పదని గ్రహించాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ స్కాంలు చేసేవారు కూడా బాగా అప్ డేట్ అవుతూ వలపన్ని మోసాలకు పాల్పడుతున్న రోజులివి. వాట్సాప్ వేదికగా…