Google Pixel 10, Pixel 10 Pro, and Pixel 10 Pro XL: Made by Google 2025 ఈవెంట్‌లో భాగంగా గూగుల్ తన తాజా పిక్సెల్ 10 సిరీస్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో పిక్సెల్ 10 (Google Pixel 10), పిక్సెల్ 10 ప్రో (Google Pixel 10 Pro), పిక్సెల్ 10 ప్రో XL (Google Pixel 10 Pro XL) మోడల్స్ ఉన్నాయి. అన్ని మోడల్స్‌లో కూడా గూగుల్ స్వయంగా రూపొందించిన టెన్సర్ G5 ప్రాసెసర్, టైటాన్ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ అమర్చబడ్డాయి.
ఈ ఫోన్లలో టెలిఫోటో కెమెరా, సూపర్ రెజ్ జూమ్, అలాగే మాక్రో ఫోకస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. వీటితోపాటు, ఈ మూడు మోడల్స్‌కి 7 సంవత్సరాల పాటు OS అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇంకా పిక్సెల్ డ్రాప్‌లు అందించబడతాయి. మరి ఈ మూడు మొబైల్స్ స్పెసిఫికేషన్స్ ను విడివిడిగా ఇలా ఉన్నాయి.

భారత మార్కెట్లో Google Pixel 10 Pro Fold లాంచ్.. ధర, ఫీచర్లు వివరాలు ఇలా!
గూగుల్ పిక్సెల్ 10 స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.3 అంగుళాల OLED, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ 2,
బ్రైట్ నెస్: 3,000 నిట్స్ పీక్
ప్రాసెసర్: టెన్సర్ G5
స్టోరేజ్: గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్
బ్యాటరీ: 4,970 mAh, 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్
కెమెరాలు: 48MP మెయిన్ (మాక్రో ఫోకస్‌తో), 13MP అల్ట్రా వైడ్, 10.8MP టెలిఫోటో (5x ఆప్టికల్ జూమ్), 10.5MP సెల్ఫీ కెమెరా
కలర్స్: ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్, ఒబ్సిడియన్

Godavari Flood: గోదావరి నది ఉగ్రరూపం.. ధవళేశ్వరం బ్యారేజీకి పెరిగిన వరద ఉద్ధృతి..
గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.3 అంగుళాల LTPO OLED, 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ బ్రైట్ నెస్
ప్రాసెసర్: టెన్సర్ G5, టైటాన్ M2
స్టోరేజ్: గరిష్టంగా 16GB RAM, 256GB స్టోరేజ్
బ్యాటరీ: 4,870 mAh, 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్
కెమెరాలు: 50MP వైడ్, 48MP అల్ట్రా వైడ్ (మాక్రో ఫోకస్‌తో), 48MP 5x టెలిఫోటో, 42MP ఫ్రంట్ కెమెరా
కలర్స్: మూన్‌స్టోన్, జేడ్, పోర్సిలైన్, ఒబ్సిడియన్
గూగుల్ పిక్సెల్ 10 ప్రో XL స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: 6.8 అంగుళాల LTPO AMOLED, 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ బ్రైట్ నెస్
ప్రాసెసర్: టెన్సర్ G5, టైటాన్ M2
బ్యాటరీ: 5,200 mAh, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్
కెమెరాలు: 50MP వైడ్, 48MP అల్ట్రా వైడ్ (మాక్రో ఫోకస్‌తో), 48MP 5x టెలిఫోటో (100x సూపర్ రెజ్ జూమ్), 42MP ఫ్రంట్ కెమెరా
కలర్స్: మూన్‌స్టోన్, జేడ్, ఒబ్సిడియన్

ధరలు, లభ్యత:
పిక్సెల్ 10 (256GB) – రూ.79,999
పిక్సెల్ 10 ప్రో (256GB) – రూ.1,09,999
పిక్సెల్ 10 ప్రో XL (256GB) – రూ.1,24,999
ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వీటితోపాటు పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL కొనుగోలు చేసిన వారికి గూగుల్ AI Pro ఒక సంవత్సరపు సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించబడుతుంది.