Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Google Ceo Sundar Pichai Ai Market Reaction

Sundar Pichai: డోంట్ వర్నీ.. కొత్త ఏఐపై గూగుల్ సీఈఓ క్లారిటీ..

Published Date :February 6, 2026 , 1:12 pm
By RAMAKRISHNA KENCHE
Sundar Pichai: డోంట్ వర్నీ.. కొత్త ఏఐపై గూగుల్ సీఈఓ క్లారిటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sundar Picha: టెక్ ప్రపంచం ఒక్కసారిగా కుదేలైంది. ఒక్క ఏఐ టూల్‌లో టెక్కీలు భయాందోళనకు గురయ్యారు. టెక్నాలజీ ప్రపంచంలో గత కొన్ని రోజులుగా ఒక్కసారిగా భయం చుట్టుముట్టింది. ఆంత్రోపిక్ అనే ఏఐ కంపెనీ విడుదల చేసిన కొత్త ప్లగిన్లతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. వీటితో సాఫ్ట్‌వేర్ కంపెనీల రోజులకు రోజులు దగ్గర పడ్డాయనే వాదనలు జోరుగా వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ షేర్లు భారీగా పడిపోయాయి. ఒకే రోజులో దాదాపు 285 బిలియన్ డాలర్లు పతనమయ్యాయి. దీనికి కొంతమంది ‘సాస్‌పోకలిప్స్’ అనే పేరు కూడా పెట్టేశారు. ఈ అంశంపై తాజాగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఏఐ అనేది ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం కాదని.. ఇది మనం చేసే పనికి సహాయం చేసే ఒక సాధనం మాత్రమే అని స్పష్టం చేశారు. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ఏఐ వల్లే మరింత మెరుగయ్యాయని తెలిపారు. కంపెనీలకు ఇదే మంచి సమయమని వెల్లడించారు. మార్కెట్‌లో వచ్చిన ఈ గందరగోళం అంతా అతిశయోక్తే అని అభిప్రాయపడ్డారు.

READ MORE: Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!

ఈ మాటలకు ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ సైతం మద్దతిచ్చారు. ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ షేర్ల పతనం తనకు అయితే ప్రపంచంలోనే అతి అవివేకమైన విషయం అనిపిస్తోందని వ్యాగ్యంగా అన్నారు. “ఒక స్క్రూ తిప్పడానికి కొత్త సాధనం తయారు చేస్తామా? లేక ఉన్న స్క్రూడ్రైవర్‌నే వాడతామా? ఏఐ కూడా అంతే. ఇది ఉన్న సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంది. కానీ వాటిని పూర్తిగా తీసేయదు” అని తెలిపారు. ఎన్విడియాలోనూ ఇలాంటి ఏఐ టూల్స్‌ని వాడటం వల్ల ఉద్యోగులు చిన్న పనుల నుంచి విముక్తి పొందారని, అసలు ముఖ్యమైన చిప్స్ డిజైన్ చేసే పనిపై దృష్టి పెట్టగలుగుతున్నారని చెప్పారు. అయితే ఈ భయానికి అసలు కారణం ఆంత్రోపిక్ ‘క్లాడ్ కోవర్క్’ అనే ఏఐకి చెందిన 11 ఓపెన్ సోర్స్ ప్లగిన్లు. ఇవి సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, కస్టమర్ సపోర్ట్ లాంటి సాధారణ కార్యాలయ పనులు చేస్తాయి. కానీ అసలు గుబులు తెచ్చింది లీగల్ ప్లగిన్. ఇది ఒప్పందాలు చెక్ చేయడం, ఎన్‌డీఏలు చూసుకోవడం, నిబంధనల పరిశీలన, లీగల్ రిపోర్టులు తయారు చేయడం లాంటి పనులన్నీ ఆటోమేటిక్‌గా చేస్తుంది. దీంతో పెద్ద లీగల్ కంపెనీల భవిష్యత్తు మీద అనుమానాలు మొదలయ్యాయి. దీని ఎఫెక్ట్‌తో థామ్సన్ రాయిటర్స్, రిలెక్స్ లాంటి సంస్థల షేర్లు దాదాపు 15 శాతం పడిపోయాయి. లీగల్‌జూమ్ అయితే 20 శాతం కుప్పకూలింది. భారత్‌లోనూ ప్రభావం కనిపించింది. ఇన్ఫోసిస్, విప్రో లాంటి ఐటీ కంపెనీల షేర్లు తగ్గాయి.

READ MORE: మాగ్నెటిక్ వైర్‌లెస్ చార్జింగ్, 10,000mAh బ్యాటరీతో Portronics Moji 10 స్పెసిఫికేషన్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AI market panic
  • Anthropic AI plugins
  • Cloud CoWork AI assistant
  • Google CEO Sundar Pichai AI statement
  • Infosys Wipro AI effect

తాజావార్తలు

  • Director Ranjith: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. దర్శకుడు రంజిత్ అరెస్ట్

  • Sai Rajesh :మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ప్లస్ పాయింట్..

  • Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?

  • JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

  • Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్‌ డిపాజిట్‌.. నిబంధనలు విత్‌డ్రా..!

ట్రెండింగ్‌

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions