Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం పాశవిక ఘటన చోటు చేసుకుంది. విద్యార్థుల సందడితో కళకళలాడే పాఠశాల ప్రాంగణం ఒక్కసారిగా కేకలతో హోరెత్తింది. తరగతి గదిలో విద్యార్థులంతా పాఠాలు వింటున్న సమయాన, ఓ ఉన్మాది హఠాత్తుగా స్కూల్ ఆవరణలోకి చొరబడ్డాడు. పదో తరగతి చదువుతున్న ఓ బాలికని లక్ష్యంగా చేసుకుని, చెక్క మొద్దులు కోసే పదునైన ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు. ఆ ఆగంతకుడు బాలిక గొంతును దారుణంగా కోసేశాడు. ఆ బాలిక తీవ్ర రక్తస్రావంతో పాఠశాల ప్రాంగణంలోనే కుప్పకూలిపోయింది. కళ్లెదుటే జరిగిన ఈ ఊహించని ఘోరాన్ని చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయులు తేరుకుని అతడిని పట్టుకునే లోపే ఆ దుండగుడు అక్కడ నుంచి వేగంగా పరారయ్యాడు.
రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆ విద్యార్థినిని చూసి చలించిపోయిన పాఠశాల సిబ్బంది, స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యులు ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితురాలి కుడి చేయి తెగిపోగా.. ముఖంపై పెద్ద గాయం అయ్యింది. ప్రస్తుతం వైద్యులు ఆ బాలికను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలు అయ్యవారిపల్లెకు చెందిన బాలికగా గుర్తించారు. ఆ దుండగుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, రంపంతో స్కూల్లోకి దుండగుడు ప్రవేశించడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. “ఎవరూ వేధిస్తున్నట్లు మా పాప చెప్పలేదు. రోజూ ఆటోలో స్కూల్‌కు వెళ్తుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలి. నిందితుడు ఎవడైనా, ఆఖరికి మా బంధువైనా శిక్షించాల్సిందే” అని బాలిక మేనత్త స్పష్టం చేసింది.
Also Read
- Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
- Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
- Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
- Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
తాజావార్తలు
-
CM Vijay: తేని జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్.. సీఎం విజయ్ సంచలన చర్య, అధికారులపై వేటు!
-
Arnab Cyclone: ఏపీకి కేంద్ర బృందాలు.. అర్నబ్ తుఫాన్ నష్టాలు, ఖరీఫ్ కరువుపై క్షేత్రస్థాయి పరిశీలన
-
Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
-
Pawan Sahu : యూట్యూబ్‌లో 2.77 కోట్ల సబ్స్క్రైబర్లు.. ఏం లాభం? భార్యను సర్పంచ్‌గా గెలిపించలేకపోయాడు!
-
Anantapur: రాప్తాడులో పాశవిక ఘటన.. తరగతి గదిలో పదో తరగతి బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!