Vijay Devarakonda: సాధారణంగా నిర్మాతలు.. ఒక హీరోతో హిట్ కొడితే .. అదే హీరోను రిపీట్ చేస్తూ ఉంటారు. అదే ప్లాప్ వచ్చింది అంటే అస్సలు ఆ హీరో వైపు చూడరు. అంటే అందరు నిర్మాతలు అలాగే ఉండరు. కానీ, చాలామటుకు ఇలాగె ఉంటారు అనేది ఇండస్ట్రీ టాక్. సరే ఒక మోస్తారు ప్లాప్ వచ్చిందంటే ఓకే. కానీ, అస్సలు సినిమా డిజాస్టర్.. కోట్లల్లో నష్టం వచ్చినా కూడా ఒక నిర్మాత అదే హీరోతో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అంటే.. నిజంగా ఏం గుండెరా అది అని డైలాగ్ వినిపించకమానదు. ఇంతకీ ఆ హీరో ఎవరు..నిర్మాత ఎవరు అంటే.. విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. బాక్సర్ గా విజయ్ కనిపించాడు.
Manchu Lakshmi: మంచు కుటుంబం నుంచి అక్కడికి మకాం.. దానికోసమేనా..?
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన లైగర్.. భారీ పరాజయాన్ని అందుకోవడమే కాకుండా కొన్ని కోట్ల నష్టాన్ని నిర్మాతకు తీసుకొచ్చిపెట్టింది. ఇప్పటికీ.. డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమ ఇచ్చిన నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు. అంతలా నష్టాన్ని ఇచ్చిన కూడా విజయ్ తో మరోసారి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు కరణ్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ తో కరణ్ ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరణ్ ప్రస్తుతం..విజయ్ కోసం ఒక టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ ను వెతుకుతున్నాడట. అది ఓకే అవ్వగానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ చేతిలో..మూడు సినిమాలు ఉన్నాయి. మరి ఈసారైనా.. విజయ్, కరణ్ కు హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.