ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.. పాత వాటితో కొత్త సమస్యలు వస్తున్నాయంటే.. వాటిని అధిగమించడానికి కొత్త దారులను వెతుకుతోంది డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్).. ఇప్పుడు షార్ట్ మెసేజ్ సర్వీస్ (ఎస్ఎంఎస్)లపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది… డాట్ తీసుకొచ్చిన ఈ నయా రూల్ ప్రకారం.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా సహా టెలికాం ఆపరేటర్లకు అందరికీ వర్తించనుంది.. ఇంతకీ ఎస్ఎంఎస్‌లపై కొత్త రూల్ అంటే.. మొత్తంగా ఎస్‌ఎంఎస్‌లు ఆపేస్తారా ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం ఏంటంటే.. సిమ్ మార్పిడి చేసినప్పుడు కానీ.. సిమ్ అప్‌గ్రేడ్ చేసే ప్రక్రియలో గానీ.. ఎస్‌ఎంఎస్‌లు ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ రెండూ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది డాట్.. అంటే, కొత్త సిమ్ కార్డ్‌లను యాక్టివేట్ చేసిన వెంటనే.. ఇక, ఎస్‌ఎంఎస్ పంపడం గానీ, రిసీవ్ చేసుకోవడం కానీ కుదరదు.. 24 గంటలు గడిచిన తర్వాతే ఆ సర్వీసులు పొందే వీలు ఉంటుంది. ఈ కొత్త నిబంధనను అమలు చేసేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు 15 రోజుల గడువు ఇచ్చింది డాట్.
Read Also: Mobile Phones Ban: అక్కడ మొబైల్ ఫోన్స్ వాడడంపై నిషేధం.. ఏకగ్రీవ తీర్మానం
అంటే, ఈ కొత్త రూల్స్ ప్రకారం.. సిమ్ కార్డ్ లేదా నంబర్‌ను మార్చమని సదరు కస్టమర్ నుంచి అభ్యర్థనను స్వీకరించిన తర్వాత.. టెలికాం ఆపరేటర్లు కస్టమర్లకు అభ్యర్థనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా పంపాలి.. సిమ్ కార్డ్ హోల్డర్ ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అభ్యర్థనను మరింత ధృవీకరించాలి. అథెంటికేషన్ ప్రక్రియ అధీకృత సిమ్ కార్డ్ హోల్డర్ నుంచి రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.. కస్టమర్ ఏదైనా సమయంలో సిమ్ కార్డ్ అప్‌గ్రేడ్ అభ్యర్థనను తిరస్కరిస్తే.. వెంటనే సిమ్ అప్‌గ్రేడ్ ప్రక్రియను నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్‌లకు సూచించింది డాట్.. సిమ్ స్విచ్ స్కామ్‌లు, ఇతర సంబంధిత సైబర్ క్రైమ్‌ల రిస్క్ లకు చెక్ పెట్టేందుకు ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది..
ఇంతకీ సిమ్ స్వాప్ మోసం అంటే ఏమిటి? అనే విషయాల్లోకి వెళ్తే.. బ్యాంకింగ్‌తో సహా పలు రకాల సేవలను పొందేందుకు కస్టమర్‌లకు మొబైల్ నంబర్ ముఖ్యమైన గుర్తింపు సంఖ్యగా మారింది. సెక్యూరిటీ పాస్‌కోడ్‌లు మరియు లావాదేవీ సందేశాలు, ఆర్థిక లావాదేవీల కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్‌లు, నెట్‌సెక్యూర్ కోడ్ వంటి డేటా అన్నీ మన మొబైల్ నంబర్‌కి లింక్ చేయబడతాయి. అయితే, ఇకడే కేటుగాళ్లు రంగ ప్రవేశం చేస్తున్నారు.. లావాదేవీలను ప్రారంభించడానికి ఎస్‌ఎంఎస్‌లను ఉపయోగిస్తున్నారు., బ్యాంక్ లావాదేవీలను ట్రాక్ చేస్తున్నారు.. లావాదేవీ సేవలను పొందుతున్నప్పుడు రెండు-కారకాల ప్రమాణీకరణ మోడ్‌గా మొబైల్ ఎస్‌ఎంఎస్‌ని కూడా ఉపయోగిస్తున్నారు.. ఇలా ఈ ఓటీపీ నంబర్‌లకు యాక్సెస్ పొందడానికి, స్కామర్‌లు అదే మొబైల్ నంబర్‌తో డూప్లికేట్ సిమ్ కార్డ్‌లను పొందడానికి ప్రయత్నిస్తారు. వారు కోల్పోయిన సిమ్ లేదా సౌలభ్యం సాకుతో మొబైల్ ఆపరేటర్‌లను సంప్రదించి అదే నంబర్‌తో కొత్త సిమ్ కార్డ్‌ని తీసుకుంటున్నారు.. కొత్త సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత, వారు బాధితుల మొబైల్ నంబర్‌పై నియంత్రణను పొందుతారు.. దీంతో, అన్ని రహస్య ఓటీపీ నంబర్లు మరియు సందేశాలకు ప్రాప్యత పొందుతారు. ఇలా బాధితురాలి ఖాతా నుంచి వారి ఖాతాకు నగదు బదిలీ చేస్తున్నారు… అయలే, కొత్త మార్గదర్శకాలతో, ఇప్పుడు వినియోగదారులు సిమ్ మార్పు కోసం అభ్యర్థన ఉంటే నోటిఫికేషన్‌ను పొందుతారు, తద్వారా మోసం జరిగే అవకాశం ఉందని వారిని అప్రమత్తం చేస్తుంది.