స్మార్ట్ ఫోన్స్ తరహాలోనే ఈమధ్య కాలంలో స్మార్ట్ టీవీలో వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనాలకు ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్స్‌లతో, అధునాతన ఫీచర్స్‌తో టీవీలను రంగంలోకి దింపుతున్నారు. అలాంటి వాటిల్లో చైనాకు చెందిన ‘కూకా’ (Coocaa) కంపెనీ ఒకటి. ఇది రూ. 10 వేల లోపే ఒక స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
రంగారెడ్డి జిల్లా రావిరాలలోని ఫ్యాబ్ సిటీలో 32 అంగుళాలు, 42 అంగుళాలు, 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలతో ఈ సంస్థ స్మార్ట్ టీవీలను తయారు చేస్తోంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.10,000 లోపే లభిస్తోంది. నిజానికి.. ఈ స్మార్ట్ టీవీ తొలుత రూ.14,999 ధరకు రిలీజైంది. ఇప్పుడు రూ. 5 వేల తగ్గింపుతో ఇది లభ్యమవుతోంది. ప్రస్తుతం దీని ధర రూ.10,499గా ఉంది. బ్యాంకు ఆఫర్లతో రూ.10,000 లోపే ఈ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ & డెబిట్ కార్డుతో 10 శాతం, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డుతో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసుకునేవారికి.. రూ.364 నుంచి ఈఎంఐ ఆప్షన్స్ ప్రారంభమవుతాయి. అంతేకాదు.. ఎక్స్‌ఛేంజ్ ద్వారా రూ.9,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది కూకా కంపెనీ.
ఈ 32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీలో స్టాండర్డ్, వివిడ్, గేమ్, మూవీ, స్పోర్ట్స్ పేరుతో ఐదు పిక్చర్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి. డాల్బీ ఆడియోతో రెండు స్పీకర్లు ఉన్నాయి. కూలిటా ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ టీవీలో ప్రీలోడెడ్ క్లౌడ్ గేమ్స్, ఇంటర్నెట్ బ్రౌజర్, యాప్ స్టోర్ ఉంటాయి. ఇంటర్నెట్, వైఫై అవసరం లేకుండానే ఆండ్రాయిడ్ డివైజ్ నుంచి ఈ స్మార్ట్ టీవీ ఆపరేట్ చేయొచ్చు.
ఈ టీవీలో డేటా సేవర్, ఐ ప్రొటెక్షన్ మోడ్, స్మార్ట్ కంట్రోల్, ఇంటెలిజెంట్ నాయిస్ రిడక్షన్, గేమ్ మోడ్, హై డైనమిక్ కాంట్రాస్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 2 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్‌బీ పోర్ట్, వైఫై సపోర్ట్, ఎథర్‌నెట్ సపోర్ట్ ఉన్నాయి. ఇన్‌బిల్ట్ 4జీబీ స్టోరేజ్ లభించే ఈ టీవీని స్మార్ట్ రిమోట్‌తో ఆపరేట్ చేయొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం.. బడ్జెట్ ధరలోనే లభ్యమవుతున్న ఈ టీవీని మీ సొంతం చేసేసుకోండి.