5జీ సేవలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ… మొదటగా మెట్రో నగరాల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు ఆ తర్వాత క్రమంగా ఇతర నగరాలు.. పట్టణాలు ఇలా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, అదానీ గ్రూప్ కూడా రంగంలోకి దిగిపోయి.. 5 జీ సేవల పనిలో మునిగిపోయాయి.. ఇప్పుడు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (బీఎస్‌ఎన్‌ఎల్) కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది… తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. త్వరలోనే 5జీ సేవలు ప్రారంభించనున్నట్టు చెబుతున్నారు.. అయితే, బీఎస్‌ఎల్‌ఎల్ 4జీ సేవలను ప్రారంభించేందుకే ఆపసోపాలు పడుతోంది.. ఇప్పుడు ఏకంగా 5జీపై గురిపెట్టింది..
Read Also: Devi Sharan Navaratri 8th Day Special Live: దేవీ నవరాత్రులలో 8వ రోజు ఈ స్తోత్రాలు వింటే విజయం మీదే..
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2022లో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటక్స్ దాని దేశీయ 5జీ కోర్‌ను ప్రవేశపెట్టింది. ఈ 5జీ ఎన్ఎన్ఏ నెట్‌వర్క్ కోసం ర్యాన్ పరిష్కారాన్ని విసిగ్ నెట్‌వర్క్స్, వీవీడీఎన్ టెక్నాలజీలు అందించాయి. అయితే, 4జీ విషయంలో వెనుకబడిన బీఎస్‌ఎన్‌ఎల్.. 5జీపై దృష్టిసారించడం ఏంటి? అది ఎలా సాధ్యం అనే అనుమామాలు రావొచ్చు.. కానీ, దాని వెనక ఓ బలమైన కారణమే ఉంది. బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ సేవల కోసం విదేశాల నుంచి సాంకేతికతను, పరికరాలను దిగుమతి చేసుకోవడంపై ఆసక్తిలేదు.. స్వదేశీ పరిజ్ఞానంతోనే ఈ సేవలను తీసుకురావాలనేది దాని ప్లాన్.. అందుకే 5జీ ఎన్ఎస్ఏకు సి-డాట్ కోర్ బీఎస్‌ఎన్ఎల్‌కు కీలకంగా మారింది. ఢిల్లీలో ఐఎంసీ 2022 జరుగుతుండగా.. అందులో సి-డాట్ తన 5జీ ఎన్ఎస్ఏను ప్రదర్శిస్తోంది. ఇక్కడి నుంచి సి-డాట్ నుంచి చండీగఢ్ పైలట్ నెట్‌వర్క్‌కు లాంచింగ్ చేసింది. అనంతరం శాంసంగ్ ఫోన్ ఈ ఎన్ఎస్ఏ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసింది. ఆ వెంటనే శాంసంగ్ ఫోన్ బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను చూపించడం ఆసక్తికరంగా మారి..
ఇక, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలపై మాట్లాడుతూ.. 2023 ఆగస్టు 15 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీని ప్రారంభిస్తుందని వెల్లడించారు.. 2023 తొలి నాళ్లలో 4జీని ప్రారంభిస్తుందని, కాబట్టి ఆగస్టు 15 నాటికి 5జీని ప్రారంభిస్తుందని తెలిపారు. అంతేకాదు.. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ నుంచి టీసీఎస్ రూ. 16 వేల కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది.. తేజాస్ నెట్‌వర్క్స్ బీఎస్ఎన్‌ఎల్ కోసం ఎక్విప్‌మెంట్ తయారుచేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.. సి-డాట్‌తో బీఎస్ఎన్ఎల్ 5జీ పైలట్ టెస్ట్ ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. జనవరి 2023 నుంచి సి-డాట్, బీఎస్ఎన్ఎల్ కలిసి 5జీ పైలట్ టెస్టును ప్రారంభించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవలపై మరింత క్లారిటీ రావాల్సి ఉన్నా.. ప్రైవేట్ టెలికం సంస్థల కంటే తానేం తక్కువ అనే రీతిలో దూకుడు చూపిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్.. కాగా, తన వినియోగదారులకు సాధ్యమైన తక్కువ ధరలకే ప్యాకేజీలు బీఎస్‌ఎన్‌ఎల్ అందిస్తోన్న విషయం తెలిసిందే.