ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్ పర్యటనకు రాబోతున్నారు. త్వరలోనే ప్రధాని మోడీని కలవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగనున్నాయని ఈ మేరకు ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అవుతోంది. నాలుగేళ్ల నుంచి రెండు దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతోంది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలా రోజుల నుంచి విఫలమవుతున్న చర్చలు.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ కొలిక్కి వచ్చినట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని యుద్ధాలు సద్దుమణిగాయి. కానీ ఉక్రెయిన్-రష్యా యుద్ధం మాత్రం 4 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు. సౌదీ అరేబియా వేదికగా చర్చలు జరిగాయి. అనంతరం అలాస్కా వేదికగా పుతిన్‌తో స్వయంగా ట్రంప్ చర్చలు జరిపారు.
ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అయినా పురోగతి లభించలేదు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత నాలుగేళ్ల నుంచి విరామం లేకుండా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి వైట్‌హౌస్ వేదికగా సమావేశం అవుతున్నారు. అయితే ఈ సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది. ఫిబ్రవరిలో సమావేశం అయినప్పుడు ఇద్దరి మధ్య హాట్‌హాట్‌గా సమావేశం సాగింది.
ఉక్రెయిన్ తన భూభాగాన్ని రష్యాకు వదులుకోవాల్సిన అవసరం లేని విధంగా ట్రంప్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించినట్లయితే, ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ‘రేజింగ్ మోడరేట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్లరీ ఈ ప్రకటన చేశారు. నిజాయితీగా చెప్పాలంటే, ఉక్రెయిన్ తన భూమిని దురాక్రమణదారు దేశానికి (రష్యా ) వదిలివేయాల్సిన అవసరం లేని విధంగా, ఇప్పటివరకు మనం చూడని విధంగా…