600 Peoples Dies in Zambia Due to Cholera: ఆఫ్రికా దేశం అయిన జాంబియా.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జాంబియాను ప్రస్తుతం కలరా వ్యాధి పట్టిపీడిస్తోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారినపడగా.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అక్టోబర్ 2023 నుంచి దాదాపు 600 మంది కలరా వ్యాధితో మరణించారు. 15,000 మందికి పైగా కలరాతో బాధపడుతున్నారు.…
Cholera Outbreak: ఆఫ్రికా దేశం జాంబియాలో కలరా విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ఆ దేశంలో 400 మందికి పైగా మరణించారు. మరో 10,000 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలింది. కలరా భయంతో పాఠశాలల్ని మూసేసింది అక్కడి ప్రభుత్వం. సామూహిక టీకా కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తోంది. దేశ రాజధానిలో ఫుట్‌బాల్ స్టేడియంలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లను చేసింది.
Mine Collapse: ఆఫ్రికా దేశం జాంబియాలో గని ప్రమాదం జరిగింది. అక్రమంగా ఓపెన్ కాస్ట్ తవ్వకాలకు పేరుగాంచిన జాంబియాలో రాగి గని కుప్పకూలడంతో 30 మంది అందులోనే చిక్కుకుపోయినట్లు ఆ దేశ మంత్రి శుక్రవారం తెలిపారు. చింగోలాలోని ఈ ప్రమాదం జరిగినట్లు హోం వ్యవహరాల మంత్రి జాక్‌మ్వింబు పార్లమెంట్‌లో తెలిపారు.
ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం.. చాలా విషయాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్ చల్ చేస్తుంటాయి.. ఇక, లైక్‌లు, కామెంట్లు, షేరింగ్‌లు.. ఇలా అది తప్పా..? ఒప్పా..? అనే విషయంతో సంబంధం లేకుండా అలా వైరల్ చేసేవాళ్లు లేకపోలేదు.. అయితే.. ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరుగుతోన్న సమయంలో.. ఎలాంటి సమస్యలు సృష్టించకుండా సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది ఈస్ట్ ఆఫ్రికా దేశమైన జాంబియా.. ఈ నెల 12వ తేదీన జాంబియాలో దేశాధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి.…