ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు. జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా…
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) ఆదివారం కన్నుమూశారు. అంతకుముందు అనారోగ్య కారణాలతో ఆయన అమెరికాలోని ఆసుపత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యతో అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు
అంతర్జాతీయ సంగీత వేదికపై ఇండియన్ మ్యూజిక్ ఆర్టిస్టులు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ జయకేతనం ఎగరవేశారు. వీరు కంపోజ్ చేసిన 'దిస్ మూమెంట్' బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అవార్డ్ ను సొంతం చేసుకుంది.